telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ఆంధ్ర్రప్రదేశ్ లో సినిమా టికెట్ల ధరలపై కొత్త జీవో జారీ..

తెలుగు సినిమా రంగం ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్న కొత్త సినిమా టికెట్ల జీవోను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వం జారీ చేసింది.సినీ ప్రముఖులకు హామీ ఇఛ్చినట్టే.. ఏపీలో ధరలను కాస్త స్వల్పంగా పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ప్రతి థియేటర్లలో ప్రీమియం, నాన్ ప్రీమియంగా విభజించి టిక్కెట్ ధరలను నిర్ణయించిది. మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్ , నగర పంచాయతీ, గ్రామ పంచాయతీలు, ఏసీ, నాన్ ఏసీలుగా విభజించి ధరలను నిర్ణయించింది. ప్రభుత్వం నియమించిన కమిటీ సూచనల మేరకు ప్రభుత్వం సినిమా టిక్కెట్ల ధరలను నిర్ణయిస్తూ జీవోను విడుదల చేసింది.

కార్పోరేషన్లలోని నాన్ ఏసీ థియేటర్లలో ప్రీమియం టికెట్ ధర రూ.60లుగా, నాన్ ప్రీమియం టికెట్ రూ.40గా నిర్ణయించారు.ఏసీ/ఎయిర్ కూల్డ్ థియేటర్లలో ప్రీమియం టికెట్ రూ.100, నాన్ ప్రీమియం టికెట్ రూ.70.గా నిర్ణయించారు.స్పెషల్ థియేటర్లలో ప్రీమియం టికెట్ రూ.125, నాన్ ప్రీమియం టికెట్ రూ.100 గా నిర్ణయం తీసుకొన్నారు.మల్టీప్లెక్సులలో రెగ్యులర్ టికెట్ రూ.150, రిక్లయినర్ సీట్ టికెట్ రూ.250 గా నిర్ణయించారు.

మున్సిపాలిటీల్లోని నాన్ ఏసీ థియేటర్లలో ప్రీమియం టికెట్ ధర రూ.50గా, నాన్ ప్రీమియం టికెట్ ధర రూ.30గా నిర్ణయం తీసుకొన్నారు. ఏసీ/ఎయిర్ కూల్డ్ థియేటర్లలో ప్రీమియం టికెట్ ధర రూ.80గా, నాన్ ప్రీమియం టికెట్ ధర రూ.60గా నిర్ణయించారు.స్పెషల్ థియేటర్లలో ప్రీమియం టికెట్ ధర రూ.100, నాన్ ప్రీమియం టికెట్ ధర రూ.80గా మల్టీప్లెక్సులలో రెగ్యులర్ సీట్ టికెట్ ధర రూ.125, రిక్లయినర్ సీట్ టికెట్ ధర రూ.250గా నిర్ణయించారు.

నగర పంచాయితీ, గ్రామ పంచాయితీల్లో నాన్ ఏసీ థియేటర్లలో ప్రీమియం టికెట్ ధర రూ.40, నాన్ ప్రీమియం టికెట్ ధర రూ.20, ఏసీ/ఎయిర్ కూల్డ్ థియేటర్లలో ప్రీమియం టికెట్ ధర రూ.70, నాన్ ప్రీమియం టికెట్ ధర రూ.50గా నిర్ణయించారు. స్పెషల్ థియేటర్లులో ప్రీమియం టికెట్ ధర రూ.90, నాన్ ప్రీమియం టికెట్ ధర రూ.70, మల్టీప్లెక్సులలో రెగ్యులర్ సీట్ టికెట్ ధర రూ.100, రిక్లయినర్ సీట్ టికెట్ ధర రూ.250.గా నిర్ణయించారు.ఈ టికెట్ ధరలకు అదనంగా జీఎస్టీ వసూలు చేస్తారు.

భారీ బడ్జెట్ సినిమాలు 10 రోజుల పాటు టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం ఇచ్చారు. రూ.100 కోట్లు, అంతకుమించి బడ్జెట్ తో తెరకెక్కే చిత్రాలకు ఇది వర్తిస్తుంది. అయితే ఏపీ సర్కారు ఇక్కడో షరతు విధించింది. ఏపీలో 20 శాతం చిత్రీకరణ జరుపుకున్న చిత్రాలకే ఈ టికెట్ రేట్ల పెంపు వర్తిస్తుందని స్పష్టం చేసింది. ముఖ్యంగా చిన్న సినిమాలకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో చిన్న సినిమాలు ఐదో షో వేసుకోవచ్చని అనుమతి ఇస్తూ జీవో జారీ చేసింది..

మ‌రోవైపు కేవలం పవన్ కల్యాణ్ పై పగతోనే ఏపీ ప్రభుత్వం టికెట్ల ధరలను పెంచలేదని.. హామీ ఇచ్చినా నిర్ణయం వాయిదా వేసిందనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ఆర్ఆర్ఆర్ , రాధే శ్యామ్ లాంటి పెద్ద సినిమాలకు ముందు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని ప‌వ‌న్ అభిమానులు ప్ర‌తిప‌క్షాలు అంటున్నారు.

 

Related posts