telugu navyamedia
తెలంగాణ వార్తలు

నేను ఎవ‌రికి భయపడను.. నన్నెవరూ భయపెట్టలేరు..-గవర్నర్‌

*స్త్రీలకు ఇంకా అవమానాలే
*ప్రతి మహిళా ఆర్థిక స్వేచ్ఛ కలిగి ఉండాలి..
*అత్యున్నత పదవుల్లోని వాళ్లూ వివక్షకు గురవుతున్నారు
*మహిళలు అన్ని రంగాల్లో అద్భుత ప్రగతి సాధిస్తున్నా సరైన గుర్తింపు రావట్లేదని
గవర్నర్‌ తమిళిసై ఆవేదన
*మహిళా దినోత్సవం సందర్భంగా రాజ్‌భవన్‌లో కార్యక్రమం తెలంగాణ గవర్నర్ తమిళిసైకీలక వ్యాఖ్యలు

మహిళలు అన్ని రంగాల్లో ప్రగతి సాధిస్తున్నా.. ఇప్పటికీ వివక్షకు గురవుతూనే ఉన్నారని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలకు ఇప్పటికీ సరైన గౌరవం దక్కట్లేదని, అత్యున్నత ఉన్న మహిళలకూ అలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయని చెప్పారు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం రాజ్‌భవన్‌లో రాజ్​భవన్​లో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో.. మహిళా సాధికారతను ఉద్దేశించి గవర్నర్​ మాట్లాడారు మాట్లాడుతూ..భారతీయ మహిళ ఎవరికీ భయపడదని, ‘నన్ను ఎవరూ భయపెట్టలేరు. నేను దేనికీ భయపడను కూడా’అని కీలక వ్యాఖ్యలు చేశారు.

ఏ స్త్రీ తన స్వార్థం కోసం ఏదీ కోరుకోదని.. ప్రతిదీ తన కుటుంబం కోసమే కోరుకుంటుందని గవర్నర్​ తెలిపారు. స్త్రీలందరూ ఆర్థిక స్వావలంబన కలిగి ఉండాలని చెప్పారు.

మహిళలు ప్రపంచవ్యాప్తంగా ప్రేమాభిమానాలు పంచుతూ శాంతియుత జీవనం కొనసాగేందుకు ఎన్నో త్యాగాలు చేస్తున్నారని గవర్నర్‌ గుర్తు చేశారు. 

మహిళలు జీవితంలో సవాళ్లను ఎదుర్కొంటున్నా ఆర్థిక స్వతంత్రం, ఆరోగ్యవంతంగా ప్రతీ క్షణం జీవితాన్ని ఆస్వాదించాలన్నారు. మహిళా రక్షణ, లింగ సమానత్వంతో వారు పని చేసే వాతావరణం కల్పించాలని కోరారు.

మహిళలు సాధించిన అద్భుత విజయాలను గుర్తు చేసుకొని వారిని గుర్తించడం మహిళా దినోత్సవం ఉద్దేశమని అన్నారు.

ప్రతి మహిళా ఆర్థిక స్వేచ్ఛ కలిగి ఉండాలని, ఆర్థిక పరమైన విషయాల పట్ల స్వీయ నిర్ణయం పాటించాలి. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆనందాన్ని వదులుకోకూడదు. ఏదో ఒకటి సాధించాలనే తపనతో లక్ష్యాన్ని నిర్దేశించుకుని దాని వైపు అడుగులు వేయాలి. సవాళ్లతో కూడిన పనులు చేయాలి. పనుల్లో రాణించాలి. తమిళనాడు మహిళలకు, తెలంగాణ స్త్రీలకు తేడా ఏంటని.. ఇటీవల నన్ను ఓ ఇంటర్వ్యూలో అడిగారు. అందరూ ఒకేలా ఉంటారని చెప్పాను. తెలంగాణ సోదరిగా నేను ఇక్కడి మహిళల జీవన విధానాన్ని ఎంతగానో ఇష్టపడతాను అని అన్నారు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజ్‌భవన్‌లో  ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన మహిళలను గవర్నర్‌ సత్కరించారు.ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ పి.శ్రీ సుధ, జస్టిస్‌ రాధారాణి, జస్టిస్‌ మాధవీదేవి, ఎమ్మెల్యే సీతక్క, జీహెచ్‌ఎంసీ మేయర్‌ విజయలక్ష్మి, ఉపమేయర్‌ శ్రీలతారెడ్డి, పలువురు మహిళలు పాల్గొన్నారు. 

Related posts