telugu navyamedia
ఆంధ్ర వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు విద్యా వార్తలు

జేఈఈ మెయిన్ ఫలితాల విడుదల..తెలుగు విద్యార్థుల హవా!

Degree exams TDP questiona Anantapur

2019 విద్యాసంవత్సరంలో ఎన్ఐటీలలో ప్రవేశానికి, ఐఐటీ అడ్వాన్స్‌డ్ పరీక్షకు అర్హత పొందేందుకు నిర్వహించిన జేఈఈ మెయిన్ ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సోమవారం రాత్రి ప్రకటించింది. ఫలితాలతో పాటు ర్యాంకులను కూడా ఏజెన్సీ వెల్లడించింది. ఢిల్లీకి చెందిన శ్రీవాత్సవ్ జాతీయ స్థాయిలో తొలి ర్యాంకు సాధించాడు. ఇక తెలుగు విద్యార్థులు ఫలితాల్లో తమ సత్తా చాటారు. టాప్ టెన్‌లో ముగ్గురు తెలంగాణ విద్యార్ధులు, ఒకరు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్ధి ఉన్నారు.

బి. కార్తికేయకు 5వ ర్యాంకు, ఏ.సాయికిరణ్ -7, కే. విశ్వనాథ్‌కు 8వ ర్యాంకు వచ్చింది. జేఈఈ మెయిన్ ఫలితాల్లో వచ్చిన ర్యాంకు ఆధారంగా అభ్యర్థులను జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షకు ఎంపిక చేస్తారు. మే 3వ తేదీ నుంచి జేఈఈ అడ్వాన్స్‌డ్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. అడ్వాన్స్‌డ్ ఫలితాల అనంతరం జేఈఈ మెయిన్ 2019 కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభిస్తారు.

 

Related posts