telugu navyamedia
క్రీడలు వార్తలు

సాహా కరోనా నెగెటివ్…

ఐపీఎల్ 2021 నిరవధికంగా వాయిదా వేయడానికి ముందు టీమిండియా టెస్టు వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహాకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. దాంతో మే 4న ముంబై ఇండియన్స్‌, సన్‌రైజర్స్ హైదరాబాద్‌ మ్యాచ్‌ వాయిదా పడింది. అయితే సాహాకు లక్షణాలు ఉండటంతో ఢిల్లీలోనే ఐసోలేషన్లో ఉన్నాడు. టోర్నీ వాయిదా పడ్డాక కోల్‌కతాకు వచ్చి క్వారంటైన్‌లో గడిపాడు. ఇదే సమయంలో బీసీసీఐ సెలక్టర్లు ఇంగ్లండ్ పర్యటనకు భారత జట్టును ప్రకటించారు. సాహా ఫిట్‌నెస్‌ నిరూపించుకొంటే ఇంగ్లండ్‌కు వెళ్తాడని స్పష్టం చేశారు. వృద్ధిమాన్ సాహాకు రెండు రోజుల క్రితం నిర్వహించిన రెండు ఆర్టీ-పీసీఆర్‌ పరీక్షల్లో ఒకటి పాజిటివ్‌, ఒకటి నెగెటివ్‌ వచ్చింది. దీంతో అతడు జట్టులో చేరడంపై సందిగ్ధం నెలకొంది. పాజిటివ్‌ వచ్చినా.. క్వారంటైన్‌ బ్రేక్‌ చేశాడంటూ కొన్ని వదంతులు వచ్చాయి. వాటిని సాహా ఖండించాడు. ఇంకా క్వారంటైన్లోనే ఉన్నానని స్పష్టం చేశాడు. ఇప్పుడు పూర్తిగా కోలుకోవడంతో అతడు క్వారంటైన్‌ బ్రేక్‌ చేశాడు. కుటుంబ సభ్యులను కలిశాక ముంబైకి బయల్దేరనున్నాడు. వృద్ధిమాన్ సాహా కరోనా నుంచి కోలుకున్నాడు. అతడి శరీరంలో పూర్తి స్థాయిలో యాంటీబాడీస్‌ ఉండటంలో మళ్లీ వైరస్‌ సోకే అవకాశాలు అత్యంత తక్కువ’ అని బీసీసీఐ బోర్డు వర్గాలు మీడియాకు తెలిపాయి. ఇంగ్లండ్‌కు బయలు దేరేముందు ముంబైలో టీమిండియా కఠిన ఆంక్షల మధ్య బయో బబుల్‌లో ఉండనుంది. ఈ బయో బబుల్‌లో చేరడానికి ముందు సాహా మరోసారి RT-PCR పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది.

Related posts