telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

జనవరి 4న మరోసారి కేంద్రం-రైతుల సమావేశం…

ఢిల్లీలో రైతులు కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యసాయ చట్టాలను రద్దు చేయాలంటూ సుదీర్ఘపోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే నిన్న రైతు సంఘాలతో కేంద్రం చర్చలు జరిపింది… రైతు సంఘాల ప్రతినిధులు, కేంద్ర ప్రభుత్వం మధ్య.. దాదాపు 5 గంటల పాటు ఈ చర్చలు సాగాయి.. జనవరి 4వ తేదీన మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు. అయితే, ఈసారి కాస్త ముందడు పడింది.. ఇప్పటి వరకు చర్చల్లో ప్రతిష్టంభన కొనసాగుతూ రాగా… ఇవాళ  రైతుల డిమాండ్ మేరకు ఎంఎస్‌పీపై కమిటీ వేసేందుకు కేంద్రం సుముఖం వ్యక్తం చేసింది. అలాగే, విద్యుత్ బిల్లులను పెండింగ్‌లో పెట్టేందుకు కూడా ప్రభుత్వం అంగీకరించింది. మిగతా అంశాలనూ పరిగణనలోకి తీసుకుంటామని రైతులు ముందుగా తమ ఆందోళనను విరమించాలని కేంద్రం కోరింది. దేశ రాజధాని పరిసర ప్రాంతాల్లో వాయు కాలుష్య ఆర్డినెన్స్ లో శిక్ష, జరిమానాల నుంచి రైతులను మినహాయిస్తూ సవరణలకు అంగీకారం తెలిపింది… విద్యుత్తు చట్ట సవరణ ముసాయిదా బిల్లు ఉపసంహరణకు కేంద్రం సమ్మతి తెలిపింది… అయితే, రైతుల ప్రధాన డిమాండ్‌ అయిన.. 3 వ్యవసాయ చట్టాల రద్దుపై ప్రతిష్టంభన కొసాగుతోంది. 3 చట్టాలను పూర్తిగా రద్దు చేసే అంశంపై జనవరి 4న చర్చలు జరగనున్నాయి. చూడాలి మరి అక్కడ ఏం జరుగుతుంది అనేది.

Related posts