హైదరాబాద్ జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లో పలుచోట్ల శనివారం రాత్రి ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా మద్యం తాగి వాహనాలు నడిపిన 85 మందిపై కేసులు నమోదు చేశారు. అదేవిధంగా 34 కార్లు, 47 బైక్‌లు, 4 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు.
కాగా తనిఖీలు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులతో ఓ యువతి వాగ్వాదానికి దిగింది. యువతి మోతాదుకు మించి మద్యం సేవించినట్లు పరీక్షల్లో నిర్దారణ అయింది. తన వావానాన్ని స్వాధీనం చేసుకోవడంపై యువతి ట్రాఫిక్ పోలీసులతో వాగ్వాదానికి దిగింది. పట్టుబడడ మరో యువకుడు తన వాహనంతో సహా ఉడాయించాడు.