telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

చంద్రబాబు కరోనాను ఎలా ఎదురుకున్నాడో చెప్పేసిన విజయసాయిరెడ్డి

vijayasaireddy ycp

చంద్రబాబుపై మరోసారి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సెటైర్ వేశారు. ఈ సారి కరోనా వైరస్ ను చంద్రబాబు ఎలా ఎదుర్కోగలిగాడు అనే దానిపై ట్వీట్ చేశారు.
“కరోనాను బాబు ఎలా ఎదుర్కోగలిగాడు?
1. 8 నెలలుగా ఇంట్లో దాక్కోవడం ద్వారా…
2. తాను కనిపించకపోయినా బాబు వెన్నుపోటు పొడుస్తాడని కరోనా భయపడడం వల్ల…
3. కరోనాయే ఛీకొట్టి సామాజిక దూరం పాటించడం వల్ల…
4. లోకేష్‌ అనే మహావీరుడి వల్ల!!” అంటూ బాబుపై విజయసాయిరెడ్డి కౌంటర్ వేశారు.
ఇది ఇలా ఉండగా…అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో బాబు, లోకేష్ లపై విమర్శలు గుప్పించారు. “నేను అమెరికా అధ్యక్షుడు అయ్యానంటే దానికి కారణం చంద్రన్నే”… సన్నిహితులతో జో బైడెన్! హిల్లరీకి పలికినట్లు నాకు చంద్రన్న మద్దతు ఇవ్వకపోవడం వల్లే ఇది సాధ్యమయ్యిందన్న బైడెన్. లోకేశం పోటీచేసినట్లైతే బైడెన్ కి డిపాజిట్లు గల్లంతయ్యేవి!” అంటూ త్వేట్ చేశారు. అంతకుముందు..” ఆయన ‘సలహాల’తోనే జో బైడెన్ గెలిచాడు అంటే, ఆట పట్టిస్తున్నారని ఆక్షేపిస్తారు గాని బాబు చెప్పే ‘కథలు’ అలాగే ఉంటాయి. ఎవరు విజయం సాధించినా, దేని గురించైనా నలుగురు ప్రశంసా పూర్వకంగా మాట్లాడుకున్నా అది నావల్లనే జరిగింది అంటాడు. పోసుకోలు కబుర్లవల్ల నవ్వులపాలు అవుతున్నా గ్రహించడు.” అని ఎద్దేవా చేశారు.

Related posts