ఎల్‌ఆర్‌ఎస్ తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్లాట్ల క్రమబద్ధీకరణ పథకం (ఎల్‌ఆర్‌ఎస్) కింద 2015లో దరఖాస్తు చేసుకున్నవారు మళ్లీ దరఖాస్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదని కీలక నిర్ణయం తీసుకుంది. నిబంధనలు, షరతులు అన్ని ఒకేవిధంగా ఉన్నందున పెండింగ్ దరఖాస్తులను ప్రస్తుత ఎల్‌ఆర్‌ఎస్ బోర్డులోకి తీసుకునేందుకు మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ అనుమతి ఇచ్చారు. నిబంధనల ప్రకారం వాటిని క్రమబద్ధీకరించాలని కేటీఆర్ సూచించారు.
ఈ మేరకు ఎల్‌ఆర్‌ఎస్ పథకం 2015 కింద జనవరి 31,2020 వరకు వచ్చిన దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి అర్వింద్‌కుమార్ అధికారులను కేటీఆర్ ఆదేశించారు. పెండింగ్ దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించాలని సూచిస్తూ జీహెచ్‌ఎంసీ కమిషనర్, హెచ్‌ఎండీఏ కమిషనర్, కుడా వైస్ చైర్మన్, అన్ని మున్సిపాలిటీల కమిషనర్లు, టౌన్‌ప్లానింగ్ అధికారులకు సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. కాగా.. ఎల్‌ఆర్‌ఎస్ పై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది. అటు ప్రతిపక్షాలు స్థైతం ఎల్‌ఆర్‌ఎస్ విధానంపై తెలంగాణ ప్రభుత్వాన్ని గట్టగానే ప్రశ్నిస్తుంది.
రిజర్వేషన్లు రాజ్యాంగం కల్పించిన హక్కు: మాయావతి