telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

లక్షలాది మంది రైతులు కేందారం వైపే ఉన్నారు…

కొత్తగా కేంద్ర తెచ్చిన వ్యవసాయ బిల్లులపై రైతులు నిరసన చేస్తున్న విషయం తెలిసిందే. అయితే లక్షలాది మంది ప్రభుత్వానికి మద్దతు ప్రకటిస్తున్నారిన కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమార్ అన్నారు. దేశంలో లక్షల సంఖ్యలో రైతులు మాకు మద్దతుగా ఉన్నారని ఆయన తెలిపారు. ‘కొందరు రైతులు వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నప్పటికీ, లక్షల సంఖ్యలో రైతులు మాకు మద్దతు తెలిపుతున్నారు. వారు కూడా కలవనున్నారు. నేడు గ్వాలియోర్ వద్ద వేల మంది రైతులు మద్దతుగా వచ్చార’ని ఆయన అన్నారు. అయితే ఎందరో రైతులు ఢిల్లీ చుట్టుపక్కలా నిరసనలు చేస్తున్నారు. కానీ మధ్యప్రదేష్‌లో తమకు మద్దతుగా కూడా రైతులు చేరుతున్నారని ఆయన అన్నారు. అంతేకాకుండా స్వామినాథన్ కమిషన్ ప్రకారం రైతులకు దాదాపు యాభై శాతం లాభాలు వచ్చేలా మినిమం సపోర్ట్ ప్రైజ్‌ను తీసుకొచ్చినట్లు తెలిపారు. దాంతో ఏ పంట వేసిన రైతుకైనా లాభం వస్తుందని ఆయన చెప్పారు. ‘స్వామినాథన్ కమిషన్ ప్రకారం ఎంఎస్‌పీ ద్వారా రైతులకు 50శాతం లాభాలు వచ్చేలా ఉండాలని తెలుపుతోంది. అంతేకాకుండా ఈ కమిషన్ తన రికమండేషన్స్‌ను 2006లోనే యునైటెడ్ ప్రొగ్రెస్సివ్ అల్లియన్స్ (యూపీఏ) కు ఇచ్చింది. కానీ నిర్ణయం తీసుకోలేదు. కానీ మోదీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొని ఎంఎస్‌పీను తీసుకు వచ్చింద’ని ఆయన అన్నారు. మధ్యప్రదేశ్‌లో చేరుతున్న రైతులు ప్రభుత్వానికి మద్దతు తెలిపేవారని, నిరసనలకు అడ్డుకట్ట వేయడానికే వారు ఈ నిర్ణయం తీసుకున్నారని అన్నారు.

Related posts