telugu navyamedia
రాజకీయ వార్తలు

అక్రమ వలసదారులను అనుమతించేది లేదు: అమిత్‌షా

amith shah bjp

అక్రమ వలసదారులకు అడ్డుకట్ట వేసే విషయంలో ఎట్టి పరిస్థితుల్లో వెనుకడుగు వేయమని కేంద్రహోం మంత్రి అమిత్‌షా స్పష్టం చేశారు. ఈ విషయంలో పశ్చిమ బెంగాల్‌లోని తృణమూల్‌ ప్రభుత్వం అక్కడి ప్రజల్ని తప్పుతోవ పట్టిస్తోందని ధ్వజమెత్తారు. ఇటీవల ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైన అస్సాంలో భారతీయ పౌరసత్వ రిజిస్టార్‌ ఆప్‌డేషన్‌తో కేంద్రం ఈ ప్రక్రియకు శ్రీకారంచుట్టింది.ఈ సందర్భంగా కొన్ని విమర్శలు వెల్లువెత్తాయి.

ముఖ్యంగా తృణమూల్‌ కాంగ్రెస్‌ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇటీవల బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సమస్యను అమిత్‌షా దృష్టికి తీసుకువెళ్తూ తమ రాష్ట్రంలో ఎన్‌ఆర్‌సీని అమలు చేయాల్సిన అవసరం లేదని లేఖ కూడా రాశారు. ఈనేపథ్యంలో అమిత్‌షా మాట్లాడుతూ అక్రమ వలసదారులను ఓటు బ్యాంకుగా మార్చుకోవడం వల్లే తృణమూల్‌ ప్రభుత్వం ఎన్‌ఆర్‌సీ అమలును వ్యతిరేకిస్తోందని విమర్శించారు. ఆ పార్టీ చెబుతున్నట్లు శరణార్థులకు ఎటువంటి భయం అక్కర్లేదన్నారు.

Related posts