telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

కరోనాపై పోరుకు ట్విట్టర్ భారీ సహాయం

twitter logo

 దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ తగ్గుతూ వస్తున్నాయి. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియాకు అండగా నిలుస్తామని ఇప్పటికే చాలా దేశాలు మద్దతు ప్రకటించాయి. అందులో భాగంగానే వైద్య సామగ్రి, ఆక్సిజన్ ను ఇండియాకు అందిస్తూ తమ వంతు సాయం అందిస్తున్నాయి.  ఇందులో భాగంగా ప్రముఖ సోషల్ మీడియా ట్విట్టర్ 110 కోట్ల రూపాయల సహాయాన్ని ప్రకటించింది.  ఈ మొత్తాన్ని భారత్ లోని కేర్, ఎయిడ్ ఇండియా, సేవ ఇంటర్నేషనల్ సంస్థలకు పంపిణి చేసింది.  ఈ మూడు సంస్థలు ఈ నిధులను భారత్ లో కరోనా మహమ్మారి కోసం ఖర్చు చేయనున్నాయి.  ఆక్సిజన్, కరోనా కేర్ సెంటర్లు, వ్యాక్సిన్ తదితర  వాటికి ఖర్చు చేయబోతున్నాయి.  

Related posts