telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

లండ‌న్‌ అమ్మాయితో శింబు పెళ్ళి… క్లారిటీ ఇచ్చిన హీరో తండ్రి

Simbu

త‌మిళ న‌టుడు శింబు లండ‌న్‌కి చెందిన అమ్మాయితో పెళ్లి పీట‌లెక్క‌నున్నాడ‌నే వార్త హల్చల్ చేస్తోంది. తాజాగా శింబు పెళ్లిపై ఆయన తల్లిదండ్రులు సీనియర్‌ నటుడు, దర్శకుడు టీ.రాజేందర్‌, ఉషా రాజేందర్‌ క్లారిటీ ఇచ్చారు. లండన్‌కి చెందిన బంధువుల అమ్మాయితో శింబు వివాహం జ‌ర‌గ‌నుంద‌ని వ‌స్తున్న వార్త‌లు అవాస్తవం. ద‌య‌చేసి ఎవరు వాటిని న‌మ్మోద్దు. శింబుకి స‌రిపోయే జీవిత భాగ‌స్వామి కోసం చూస్తున్నాం. అన్నీ కుదిరితే అఫీషియ‌ల్‌గానే ప్ర‌క‌టిస్తాం. అప్ప‌టివ‌ర‌కు ఇలాంటి పుకార్ల‌ని న‌మ్మోద్దు అని రాజేంద‌ర్ ప్ర‌తికా ప్ర‌క‌ట‌న ద్వారా తెలిపారు. ఈ యంగ్ హీరో సినిమాల‌ కన్నా ఎక్కువగా హీరోయిన్లతో ఎఫైర్స్‌తో ఎక్కువ‌గా వార్త‌ల‌లో నిలుస్తుంటారన్న విషయం తెలిసిందే. అప్ప‌ట్లో న‌య‌న‌తార‌తో ప్రేమాయ‌ణం న‌డిపిన శింబు కొద్ది రోజుల త‌ర్వాత హ‌న్సిక ప్రేమ‌లో మునిగి తేలాడు. ఆ త‌ర్వాత త్రిష‌తో ప్రేమాయ‌ణం సాగించాడ‌ని పుకార్లు షికార్లు చేశాయి. 2019లో శింబు సోదరుడు కురళరసన్‌కు వివాహం జరిగినప్పుడు శింబు పెళ్లిపై వార్త‌లు గుప్పుమ‌న్నాయి. రీసెంట్‌గా వంట చేస్తూ కాబోయే భార్య‌ని క‌ష్ట‌పెట్ట‌నంటూ వీడియో రిలీజ్ చేశారు శింబు.

Related posts