ప్రముఖ హిందీ టీవీ నటి నియాశర్మకు దీపావళి నాడు చేదు అనుభవం ఎదురైంది. ఈ బ్యూటీ పెను ప్రమాదం నుంచి బయటపడింది. దీపావళి సందర్భంగా ఆమె ఒక పార్టీకి హాజరయ్యింది. అక్కడ ఆమె ధరించిన డ్రైస్‌కు నిప్పంటుకుంది. దీంతో డ్రెస్ కొంతమేరకు కాలిపోయింది. అయితే నిప్పంటుకున్న వెంటనే ఆమె అప్రమత్తం కావడంతో ప్రమాదం నుంచి తప్పించుకోగలిగింది. నియా తన సోషల్ మీడియా అకౌంట్‌లో దీపావళి రోజున తనకు ఎదురైన ఈ చేదు అనుభవాన్ని తన అభిమానులతో పంచుకుంది. ఈ సందర్భంగా చిన్న దీపమే అయినప్పటికీ పెద్ద ప్రమాదాన్ని తీసుకువస్తుందని పేర్కొంది. అలాగే ఆమె కాలిపోయిన తన దుస్తులకు సంబంధించిన ఫోటోను కూడా షేర్ చేసింది. అందుకే దీపావళి రోజు జాగ్రత్తగా ఉండడం మంచిది.