టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్ కొంతకాలం క్రితం పవన్ జనసేనాని, పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్‌పై పరోక్షంగా విమర్శలు చేసి వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. ఆ సమయంలో పూనమ్ కౌర్, పవన్ కళ్యాణ్ పై కత్తి మహేష్ సంచలన కామెంట్స్ చేశారు. అయితే ఎన్నికల సమయంలో ఎందుకనో ఆమె సైలెంట్ అయ్యారు. ఇప్పుడు కూడా సైలెంట్‌గానే ఉంటూ వచ్చారు. అయితే రీసెంట్గా ఆమె పెట్టిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. “ఓ అబద్ధాల కోరు రాజకీయ నాయకుడు కాగలడు కానీ.. లీడర్ కాలేడు” అంటూ జస్ట్ థాట్ అనే హ్యాష్ ట్యాగ్ తో పూనమ్ ట్వీట్ చేసింది. ట్వీట్లో ఎవరి పేరునూ ప్రస్తావించక పోయినప్పటికీ పవన్ ఫ్యాన్స్ మాత్రం తమ హీరోని దృష్టిలో పెట్టుకునే పూనమ్ ట్వీట్ చేసిదంటూ రియాక్ట్ అవుతుండటం హాట్ టాపిక్‌గా మారింది.
A liar can become a politician but never a leader …. #justathought
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) October 28, 2019