telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

పెన్షన్లు తొలగించడంపై నారా లోకేశ్ ఫైర్

Minister Lokesh comments YS Jagan

ఏపీ సర్కార్ పెన్షన్లు తొలగించడంపై టీడీపీ నేత నారా లోకేశ్ మండిపడ్డారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ని ఉద్దేశించి తీవ్ర విమర్శలు ట్వీట్ చేస్తూ ఓ వీడియో పోస్ట్ చేశారు. అవివాహిత, వికలాంగురాలు అయిన ఆమెకు పెన్షన్ ఆపేశారని , ఈ విషయమై వాలంటీర్లను అడిగితే తాలూకాకు వెళ్లమని చెప్పారని పేర్కొన్నారు.

తాలూకాకెళితే మరో చోటకు వెళ్లమని చెప్పారని.. ఎక్కడికి వెళ్లి ఎవరిని కలిసినా స్పందించడం లేదని ఆ వీడియోలో ఓ మహిళ ఆరోపించడం కనబడుతుంది. అదే విధంగా, తనకు స్థలం ఉందని ఆరోపిస్తూ తనకు రావాల్సిన పెన్షన్ ని ఆపేశారని ఓ వృద్ధురాలు వీడియోలో ఆ వీడియోలో మొరపెట్టుకుంది.

Related posts