telugu navyamedia
ఆంధ్ర వార్తలు

కుప్పంపై క‌న్నేసిన సీఎం జ‌గ‌న్‌..కార్య‌క‌ర్త‌ల‌తో స‌మావేశం

వచ్చే ఎన్నికల్లో అత్య‌ధిక‌ స్థానాలను సాధించడానికి సీఎం వైఎస్ జగన్ స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. ఇప్ప‌టికేగడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంపై ఆయన గత నెల 18వ తేదీన ఎమ్మెల్యేలకు, నియోజకవర్గ సమన్వయకర్తలకు ఓ వర్క్ షాపు నిర్వహించారు.

రాష్ట్రంలో ఎట్టి పరిస్థితిలోనూ తిరిగి అధికారంలోకి రావాలని, అది కూడా గతంలో కన్నా ఎక్కువ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆయన వారికి సూచించారు.

ఇన్నాళ్లూ ప్రభుత్వ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నా సీఎం జగన్… ఇప్పుడు క్రియాశీల కార్యకర్తలతో సమావేశం కానున్నారు.ముందుగా టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు నియోజకవర్గం కుప్పంతో ప్రారంభించనున్నారు.

గురువారం నాడు, అంటే ఈ రోజు కుప్పం నియోజకవర్గానికి చెందిన 60 మంది పార్టీ కార్యకర్తలతో ఆయన సమావేశం కానున్నారు .అక్కడ పార్టీ బలాబలాలు, ప్రజల్లో ఉన్న టాక్, పథకాల అమలు అన్నింటిపై వారితో మాట్లాడనున్నారు.

కుప్పంలో చంద్రబాబును ఓడించాలనే పట్టుదలతో జగన్ ఉన్నారు. అందుకు చాలా కాలంగా తన వ్యూహాన్ని అమలు చేస్తూ వస్తున్నారు. జగన్ సూచన మేరకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబును బలహీనపరచడానికి అవసరమైన చర్యలన్నీ తీసుకుంటూ వస్తున్నారు. .పార్టీ అధికారంలోకి రావడానికి కార్యకర్తలే కీలకం అని జగన్ ఎన్నోసార్లు చెప్పారు.

అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యకర్తలను నేరుగా కలవలేకపోయారు.దీంతో కార్యకర్తల్లో అసంతృప్తి ఉందనే ప్రచారం జరిగింది. పార్టీని ఆధికారంలోకి తీసుకురావడానికి కృషి చేసిన శ్రేణులకు అధినేతను కలవడం కష్టమైంది. దీంతో చాలా చోట్ల గత ఎన్నికల్లో పార్టీ కోసం పని చేసిన కార్యకర్తలు ప్రస్తుతం పార్టీకి దూరంగా ఉన్నట్లు జగన్‌ దృష్టికి వచ్చింది.

ఈ క్ర‌మంలో తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఒక్కొక్క కార్యకర్తతో నిమిషం నుంచి ఒకటిన్నర నిమిషం పాటు మాట్లాడనున్నారు సీఎం జగన్. వారితో మాట్లాడి స్థానిక పరిస్థితులపై ఆరా తీయనున్నారు. ఆ తర్వాత ఒక్కొక్కరితో ఫొటో దిగానున్నారు జగన్. దీని ద్వారా కార్యకర్తల్లో ఉన్న అసంతృప్తి పోగొట్టడంతోపాటు వారిని వచ్చే ఎన్నికలకు సన్నద్ధం చేయనున్నారు.

.

Related posts