సర్వేపల్లి నియోజకవర్గంలో మత్స్యకారులకు 45 కోట్లు విడుదల చేశామని చెప్పారని అది వాస్తవం కాదని నేను మీడియా ముందు చెప్పానని తెలిపిన కాకాని గోవర్ధన్ రెడ్డి నిధులు విడుదల చేసింది నిజమని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని చెప్పానని కానీ సోమిరెడ్డి జీవో చూపించి తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. 45 కోట్లు ఇచ్చిన మాట జీవోలో ఉందా ? విడతల వారీగా ఇస్తామని జీవో లో ఉంది, తొలివిడతగా వచ్చింది 14 కోట్లు మాత్రమేనని ఆయన అన్నారు. సోమిరెడ్డి అమాయకుడు లోకేష్ నోట అబద్దాలు చెప్పించారని, ప్యాకేజీ విడుదల చేసిన జీవో ను పెద్దమనిషి వద్ద న్యాయం చెప్పమని వెళదామా ? అని ప్రశ్నించారు. కాకాని గోవర్ధన్ రెడ్డి లోకేష్ స్థాయి నాది కాదని సోమిరెడ్డి అన్నారని, నిజమే… అవినీతి పరుడు.. వెన్నుపోటు దారుడు.. ద్రోహి కి పుట్టిన లోకేష్ స్థాయి నాది కాదని కాకాని పేర్కొన్నారు. ఇసుక విషయంలో ఒక్క రూపాయి అవినీతికి పాల్పడ్డానని నీ తండ్రి చంద్రబాబు తిరుమల లో ప్రమాణ చేయమని చెప్పు అంటూ నారా లోకేష్ కి కాకాని సవాల్ విసిరారు.
previous post
చంద్రబాబే వారిని బీజేపీలోకి పంపారు: తలసాని