telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

సుదీర్ఘ మంచి కోసం.. తాత్కాలిక కష్టం తప్పదు.. : ఏపీసీఎం జగన్

ap cabinet meeting

ఏపీ కేబినెట్ సమావేశంలో మద్యం విధానంపై ఆసక్తికర చర్చ జరిగింది. మూడు స్టార్ హోటళ్లకు బార్ లైసెన్స్‌ ఫీజును కోటిన్నరగా నిర్ణయించడం వల్ల.. టూరిజం దెబ్బతింటుందని ఓ మంత్రి .. సీఎం దృష్టికి తెచ్చారు. ధరల పెరుగుదలతో పర్యాటకం దెబ్బతింటుందని సూచించారు. మీ కుటుంబ సభ్యులతో టూర్‌కి వెళ్ళినప్పుడు అక్కడి ప్రదేశాలు చూస్తారా?, అలా కాకుండా గదిలోనే కూర్చుని ఉంటారా..అని సీఎంను మంత్రి ఎదురు ప్రశ్నించారు. పర్యాటకానికి, మద్యానికి సంబంధం ఏంటని ఆ మంత్రిని సీఎం తిరిగి ప్రశ్నించారు.

ఒక వ్యక్తి వద్ద మూడు మద్యం బాటిళ్లు ఉండొచ్చని నిబంధనలు చెబుతున్నాయని మంత్రి గుర్తుచేశారు. అంత కంటే ఎక్కువ మద్యం బాటిళ్లు కలిగి ఉంటే.. రెండేళ్ల జైలు, జరిమానా, నాన్ బెయిలబుల్ కేసులు అనే అంశంపైనా చర్చించారు. బార్లలో వాళ్ళ ఇండెంట్‌కు మించి మద్యం కలిగి ఉంటే… లైసెన్స్‌కు ఐదు రెట్ల జరిమానా వేయాలని సీఎం జగన్‌ ఆదేశించారు. అంత దారుణమైన శిక్షలు వద్దని కొందరు మంత్రులు వాపోయారు. తప్పు చేసినప్పుడు శిక్ష ఎక్కువగానే ఉండాలని జగన్‌ సూచించారు.

Related posts