telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ఏపీ హైకోర్టులోనూతన జడ్జిల ప్రమాణ స్వీకారం..

*ఏపీ హైకోర్టులోనూతన జడ్జిల ప్రమాణ స్వీకారం

*ఏడుగురు కొత్త జ‌డ్జిలు ప్రమాణ  స్వీకారం

ఏపీ హైకోర్టు నూతన న్యాయమూర్తులుగా ఏడుగురు ప్రమాణ స్వీకారం చేశారు. నూతన జడ్డీలతో గవర్నర్‌ బిశ్వభూషన్‌ హరిచందన్‌ ప్రమాణం చేయించారు.

ఏవీ రవీంద్రబాబు, డాక్టర్‌ వక్కలగడ్డ రాధాకృష్ణ సాగర్, బండారు శ్యాం సుందర్, ఊటుకూరు శ్రీనివాస్, బొప్పన వెంకట లక్ష్మీ నరసింహ చక్రవర్తి, తాళ్లప్రగడ మల్లికార్జునరావు, దుప్పల వెంకటరమణలతో గవర్నర్‌ హరిచందన్‌ విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రమాణం చేయించారు.

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా మాతృమూర్తి మరణించడంతో ఆయన కార్యక్రమానికి హాజరుకాలేకపోయారు. అందువల్ల కొత్త న్యాయమూర్తులతో గవర్నర్‌ ప్రమాణం చేయించారు.

Related posts