telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

విశాఖ లో ఫిలిం నగర్ కల్చరల్ సొసైటీ కి ఐదు ఎకరాలు

8th white paper released by apcm babu
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు  ఫిలిం నగర్ కల్చరల్ సొసైటీ కి విశాఖ పట్టణం లో ఐదు ఎకరాల భూమిని కేటాయిస్తూ నిన్న ఉత్తర్వు ఇచ్చారు .  విశాఖపట్టణం లోని రురల్ మండలంలోని మధురవాడలో ని గ్రామంలో  సర్వే నెంబర్ 426/3 , జీ ఓ ఎంఎస్ నెంబర్  571 ప్రకారం  స్పెషల్ చీఫ్ సెక్రటరీ డాక్టర్ మన్ మోహన్ సింగ్  ఈ ఉత్తర్వు జారీ చేశారు . 
ఎకరానికి రెండు లక్షల ప్రకారం సంవత్సరానికి 10 లక్షల రూపాయలు  ప్రభుత్యానికి చెల్లించే షరతు మీద ఈ భూమిని కేటాయించినట్టు ఈ ఉత్తర్వులో పేర్కొన్నారు . ప్రతి సంవత్సరం 10 లక్షలు చెల్లించాలి . నిజానికి  మూడు సంవత్సరాల క్రితమే ప్రభుత్వం ఐదు ఎకరాల భూమి  ఫిలిం నగర్ కల్చరల్ సొసైటీ కి కేటాయించింది . అప్పుడు ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు విశాఖ విమానాశ్రయం  నుంచే  ఈ  భూమికి శంకుస్థాపన చేశారు . అయితే ఆ భూమి బౌద్ధ ఆరామ పరిధిలో ఉందని దాన్ని ఎట్టి పరిస్థితుల్లో క్లబ్ కు కేటాయించవద్దని నిరసనలు వ్యక్తమయ్యాయి . ఈ ప్రతిఘటనతో ప్రభుత్వం ఇబ్బందుల్లో పడిపోయింది . 
ఆ భూమిని బౌద్ధ ఆరామం  వారికే వదిలేసి ఇప్పుడు మధురవాడ లో ఐదు ఎకలాలను కేటాయిస్తూ  ఉత్తర్వు జారీ చేశారు . విశాఖ పట్టణం లో ఏర్పాటైన ఈ ఫిలిం నగర్ కల్చరల్ సొసైటీ కి అధ్యక్షుడు నిర్మాత కె . ఎస్  రామారావు . 

Related posts