పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్‌కు తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. ఆయనతో పాటు ఆయన మంత్రిమండలి రాజీనామాలను గవర్నర్‌కు సమర్పించారు.
కాగా.. గత కొంతకాలంగా పంజాబ్ కాంగ్రెస్‌లో సీఎం అమరీందర్ సింగ్ వర్గానికి, పీసీసీ అధ్యక్షుడు సిద్ధూ వర్గానికి మధ్య గత కొంతకాలంగా విభేదాలు నెలకొన్నాయి. అంతర్గత విభేదాలను తగ్గించేందుకు సిద్ధూకు పీసీసీ పగ్గాలు అప్పగించి అమరీందర్ సింగ్‌ను ముఖ్యమంత్రిగా కొనసాగించారు. అయితే, తాత్కాలికంగా ఆ విభేదాలు సద్దుమణిగినా, ఇటీవల కాలంలో మరోసారి తెరమీదకు వచ్చాయి. ముఖ్యమంత్రిని సొంతపార్టీలో విమర్శించే వ్యక్తులు ఎక్కువ కావడంతో విసుగు చెందిన సీఎం ఈరోజు రాజీనామా చేశారు.
ఇలాంటి అవమానాలతో పార్టీలో కొనసాగలేనని సోనియా గాంధీతో ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. ఆదివారం సీఎల్పీ సమావేశానికి పార్టీ పిలుపునిచ్చింది. భేటీకి కొద్ది గంటల ముందు అమరీందర్.. తన పదవికి రాజీనామా చేశారు. “సీఎల్పీ సమావేశం జరగడం ఇటీవలి కాలంలో ఇది మూడోసారి. నేను ప్రభుత్వాన్ని నడపలేనని వారికి అనుమానం ఉన్నట్టుంది. వాళ్లు(కాంగ్రెస్ సభ్యులు) నన్ను అవమానించారు. చర్చలు జరిపిన తీరు చూస్తే అది అర్థమవుతుంది. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో ఉదయం మాట్లాడాను. ఈరోజు రాజీనామా చేస్తానని చెప్పాను. ప్రస్తుతానికి నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను. నా మద్దతుదారులతో చర్చించి భవిష్యత్ కార్యచరణపై నిర్ణయం తీసుకుంటాను. వాళ్లకి(కాంగ్రెస్ అధిష్ఠానం) ఎవరి మీద నమ్మకం ఉంటే.. వారు సీఎం అవుతారు.”
అనంతరం మీడియా ముందుకొచ్చిన అమరీందర్.. తనకు అవమానం జరిగిందన్నారు. వచ్చే ఏడాది పంజాబ్ రాష్ట్రానికి ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ రాజీనామా చేయడంతో ఆ రాష్ట్ర రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.
ఉద్యమ నాయకుడు సీఎం కావడం ప్రజల అదృష్టం: తలసాని