telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

మ‌హేశ్ సినిమాలో శిల్పాశెట్టి…?

మ‌హేశ్ బాబు, త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ఇప్పుడూ సూప‌ర్ ఫామ్ లో ఉండ‌టంతో వీరి కాంబినేష‌న్ లో తెర‌కెక్క‌బోతున్న మూడో ఈ సినిమా మ‌రో లెవెల్ లో ఉంటుంద‌నే నమ్మ‌కంతో ఫ్యాన్స్ ఉన్నారు. ఈ మూవీలో ఓ కీల‌క పాత్రకు బాలీవుడ్ పొడుగు కాళ్ళ సుంద‌రి శిల్పాశెట్టిని సంప్ర‌దిస్తున్నార‌న్న‌ది ఫిల్మ్ న‌గ‌ర్ లోని తాజా స‌మాచారం. గ‌తంలోనే తెలుగులో పలు చిత్రాల‌లో శిల్పాశెట్టి నాయిక‌గా న‌టించి, మెప్పించింది. ఇక వివాహానంత‌రం తెలుగు సినిమాల‌కూ దూర‌మైనా, అడ‌పాద‌డ‌పా వెండితెర‌పై క‌నిపిస్తోంది. మరీ ముఖ్యంగా ఫిట్ నెస్ అండ్ యోగా వీడియోల‌తో ఫ్యాన్స్ కు చాలా చేరువ‌గా ఉంది. ఈ నేప‌థ్యంలో ఆమెకు ఉన్న ఇమేజ్ కు స‌రిపోయే పాత్ర‌నే ఆమెతో త్రివిక్ర‌మ్ చేయించాల‌నుకుంటున్నార‌ని తెలుస్తోంది. అయితే శిల్పాశెట్టి సైతం ఈ పాత్ర‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చి… మ‌హేశ్, త్రివిక్ర‌మ్ మూవీకి మ‌రో హైలైట్ గా నిలుస్తార‌నే తెలుస్తోంది. చూడాలి మరి ఈ సినిమా ఎప్పటికి విడుదల అవుతుంది అనేది.

Related posts