భారత్‌లో ఇప్పటి వరకు రెండు వ్యాక్సిన్లే అందుబాటులో ఉండగా.. త్వరలోనే మరిన్ని టీకాలు అందుబాటులోకి రానున్నాయి.. ప్రస్తుతం కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాలు వేస్తుండగా… వ్యాక్సినేషన్‌పై కోవిషీల్డ్ తయారీ సంస్థ సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది.. దేశ ప్రజల ప్రాణాలు పణంగా పెట్టి టీకాలు ఎగుమతి చేయలేదని స్పష్టం చేశారు.. ఆ సంస్థ చీఫ్ అదర్ పూనవల్లా. దేశంలో వ్యాక్సినేషన్‌కు సహకరించేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపిన ఆయన.. ఇప్పటివరకు 20 కోట్ల టీకా డోసులు సరఫరా చేసినట్లు ప్రకటించారు.. భారత్ వంటి దేశంలో 2 నుంచి 3 నెలల్లో వ్యాక్సినేషన్ చేయలేమని.. వ్యాక్సినేషన్ ప్రక్రియలో అనేక సవాళ్లు ఉన్నాయని తెలిపారు. ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశాల్లో భారత్ ఒకటి అని గుర్తుచేసిన అదర్ పూనవల్లా… ఇక, ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌కు 2 నుంచి 3 ఏళ్లు పట్టవచ్చు అని అంచనా వేశారు. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.