ఓ మహిళా వాలంటీర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు. అయితే ఏపీగ్రామ, వార్డు వాలంటీర్లను నియమించిన ప్రభుత్వం.. వాళ్ల ద్వారా ప్రజలకు ప్రభుత్వ పథకాలను అందేలా చూస్తోంది.. అయితే, తాజాగా మహిళా వాలంటీర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారుతలారి వెంకట్రావు. ఇప్పుడు ఎమ్మెల్యే ఫోన్‌లో మాట్లాడింది.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ద్వారకాతిరుమల మండలం మండలం రాజుపాలెం వాలంటరీగా పనిచేస్తున్నారు కంకిపాటి అన్నామణి.. మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో రాజుపాలెం పంచాయతీలో టీడీపీ బలపరిచిన అభ్యర్థి విజయం సాధించారు. ఇదే సమయంలో.. వాలంటీర్ అన్నామణి టీడీపీ అభ్యర్థికి సపోర్ట్ చేసిందంటూ ఎమ్మెల్యేకి ఫిర్యాదులు అందాయి.. దీంతో, నేరుగా వాలంటీర్‌కు ఫోన్ చేసిన ఎమ్మెల్యే వెంకట్రావు.. నువ్వు ఎవరి కోసం పనిచేస్తున్నావ్ అంటూ బెదిరింపులకు దిగారు.. మహిళా వాలంటీర్‌తో అసభ్య పదజాలంతో మాట్లాడారు సదరు ఎమ్మెల్యే.. దేవరపల్లి క్యాంప్ ఆఫీసుకి వచ్చి వివరణ ఇవ్వాలని వాలంటీర్‌ను ఆదేశించారు ఎమ్మెల్యే.. ఇప్పుడు స్థానికంగా, సోషల్ మీడియాలో ఆ ఆడియో వైరల్‌గా మారిపోయింది. అలాగే ఆ ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని అంటున్నారు ప్రజలు. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.
next post
రేవంత్ వ్యాఖ్యలతో కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయింది: కోదండరెడ్డి