telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ వార్తలు

ఏపీలో ఎన్నికలు.. నో స్టాక్ బోర్డులు పెట్టుకున్న వైన్‌ షాపులు

liquor shop q

ఏపీలో ఎన్నికలు సమయంలో ఎన్నికల కమిషన్ వైన్ షాపులను బంద్ చేయడానికంటే ముందే నో స్టాక్ బోర్డులు పెట్టుకున్నాయి వైన్ షాపులు. దాంతో మందుబాబులకు కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. అయితే ఏపీలో ఇప్పటికే సరైన బ్రాండ్లు లేవు.. పక్క రాష్ట్రాలతో పోలిస్తే లిక్కర్ రేట్లు చాలా ఎక్కువ అని మందుబాబులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. అయితే, ఇప్పుడు వారికి కొత్త సమస్యలు వచ్చాయి… దానికి ముఖ్య కారణంగా వరుస ఎన్నికలే అంటున్నారు.. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీ ఎన్నికలు జరిగాయి.. ఆ వెంటనే మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం అవుతోంది రాష్ట్ర ఎన్నికల కమిషన్.. అయితే, అభ్యర్థులు.. ఓటర్లను ఆకట్టుకోవడానికి ఎక్కడికక్కడ లిక్కర్ స్టాక్ దించుతున్నారట.. గుట్టుగా మందు పంపిణీ చేసేందుకు సిద్ధమయ్యారట. దీంతో.. సాధారణ మందుబాబులకు కష్టాలు వచ్చిపడ్డాయట… చాలా వైన్స్‌ షాపుల ముందు నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి.. కొన్ని వైన్‌షాపుల్లో అంతంత మాత్రం స్టాక్ మాత్రమే ఉండడంతో.. ఒక్కొక్కరికి ఒక్క బాటిల్ మాత్రమే అమ్ముతున్నారని చెబుతున్నారు. మొత్తంగా వరుసగా ఎన్నికలు ఏపీలో మందుబాబులకు చుక్కలు చూపిస్తున్నాయి. చూడాలి మరి ఇంకా ఏం జరుగుతుంది అనేది.

Related posts