telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

అలీబాబా’ వ్యవస్థాపకుడి విషయంలో పలు అనుమానాలు..?

అలీబాబా సంస్థల వ్యవస్థాపకుడు జాక్‌మా రెండు నెలల .. ఓపబ్లిక్‌ ఫంక్షన్‌లో కనిపించాడు. ఆఫ్రికన్ టాలెంట్ షోకు మాత్రం హాజరుకాలేదు. అదీ కాక.. జాక్‌మా..చాలా లోప్రొఫైల్ మెయింటైన్ చేస్తుంటారు. అయితే అలాంటి జాక్‌మా.. ఓ పొరపాటు చేశారు. అక్టోబర్ 24న  యాంట్‌ గ్రూప్‌ ఐపీఓ సందర్భంగా .. చైనాలో కఠినమైన ప్రభుత్వ నిబంధనలు, అవి ఆవిష్కరణలకు ఎలాంటి ఇబ్బందులు కలిగిస్తున్నాయన్న అంశంపై సూటిగా విమర్శించాడు జాక్‌మా. నేరుగా ప్రభుత్వం, కమ్యూనిస్ట్ పార్టీపై విమర్శలు చేశాడు. అంతే జాక్‌మా, యాంట్ ప్రతినిధులపై.. బీజింగ్ ఫైరైంది. ఐపీఓను నిలిపివేసింది. నెలరోజుల క్రితం అలీబాబా కంపెనీ గుత్తాధిపత్యం వహిస్తూ, ఇతర కంపెనీలు ఎదగకుండా అణచివేస్తోందన్న ఆరోపణలపై విచారణ ప్రారంభించింది. అంతే అప్పటి నుంచి జాక్ మా కనిపించడం లేదు. అయితే జాక్‌మా  ఎక్కడ? అనేది తీవ్ర కలకలం సృష్టిస్తోంది.. ఒకే ఒక్క మాట.. జీవితాన్ని తలకిందులు చేసింది. కార్పొరేట్ దిగ్గజం కనపడకుండా పోయాడు. అంతటి దిగ్గజం కనిపించకుండా పోయినా .. ఆదేశంలో కనీసం చీమ చిటుక్కుమన్నా చప్పుడు లేదు. అలీబాబా సంస్థల వ్యవస్థాపకుడు జాక్‌మా.. కనిపించకుండా పోయాడు. కాదు.. కాదు.. అతణ్ని చైనా సైన్యం బంధించింది. ఇంతకూ ఇప్పుడు జాక్‌మా ఎక్కడున్నాడు? అసలున్నాడా? ఉంటే , చైనా సైన్యం ఎక్కడ దాచింది. లేకుంటే చంపేసిందా..? ఇనుప తెరల చట్టాలతో దేశప్రజల్ని బంధించిన చైనీస్ ఆర్మీ.. ఇప్పుడు జాక్‌మానూ అరెస్ట్ చేసింది. జాక్ మా అదృశ్యం కావడం… ప్రపంచాన్ని కలవర పరుస్తోంది.

Related posts