telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ప్రభాస్ ఖాతాలో మరో అరుదైన రికార్డు… “సెక్సీయెస్ట్ ఏషియన్ మ్యాన్ ఆఫ్ 2019”

Prabhas

“బాహుబలి” చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఆసియా సెక్సీయెస్ట్ పురుషుల జాబితాలో స్థానం దక్కించుకున్నాడు. దక్షిణాది నుంచి ఈ జాబితాలో చోటు దక్కించుకున్న ఒకే ఒక్క హీరో ప్రభాస్ కావడం గమనార్హం. బ్రిటీస్ న్యూస్ వీక్లీ, ఈస్ట్రన్ ఐ సంస్థలు సంయుక్తంగా `సెక్సీయెస్ట్ ఏషియన్ మ్యాన్ ఆఫ్ 2019` సర్వే నిర్వహించాయి. ఈ జాబితాలో బాలీవుడ్ స్టార్‌హీరో హృతిక్ రోషన్ మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ప్రభాస్‌కు ఈ జాబితాలో పదో స్థానం లభించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానుల ఓట్ల ఆధారంగా ఈ జాబితాను ప్రకటించారు. దక్షిణాదికి చెందిన హీరోలెవరూ ఈ జాబితాలో నిలవలేకపోయారు. కాగా “సాహో” తరువాత ప్ర‌భాస్ నటిస్తున్న 20వ చిత్రంగా కె కె రాధా కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ఓ మూవీ చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని గోపికృష్ణ మూవీస్, యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టిస్తున్న‌ ఈ చిత్రం 1970 బ్యాక్ డ్రాప్ నేప‌థ్యంలో రూపొందుతున్న‌ట్టు స‌మాచారం.

Related posts