telugu navyamedia
సినిమా వార్తలు

పుట్టేది థ‌ర్డ్ జెండ‌ర్ అయినా ఓకే… హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు

Kalki

బాలీవుడ్ హీరోయిన్ క‌ల్కి కొచ్లిన్ త‌ల్లి కాబోతున్నారు. ఈ విష‌యాన్ని సోషల్ మీడియా ద్వారా ఆమే స్వయంగా తెలియ‌జేశారు. పియానిస్ట్ గ‌య్ హ‌ష్‌బ‌ర్గ్‌తో స‌హ‌జీవ‌నం చేస్తున్నారు. ఇప్పుడు తాను ఐదు నెల‌ల గ‌ర్భిణి అని తెలిపిన క‌ల్కికొచ్లిన్ పుట్ట‌బోయే బిడ్డ ఆడ‌, మ‌గ లేక థ‌ర్డ్ జెండ‌ర్ అయినా ఫరవాలేదు. నేను బిడ్డ‌కు మంచి పేరును సెల‌క్ట్ చేసుకున్నానని చెప్పుకొచ్చారు. త‌న ప్ర‌స‌వాన్ని గోవాలో చేసుకునేలా ప్లాన్ చేసుకున్నాన‌ని ఆమె తెలిపారు. బాలీవుడ్ ద‌ర్శ‌క నిర్మాత అనురాగ్ క‌శ్య‌ప్‌ను పెళ్లి చేసుకున్న క‌ల్కి, 2015లో అత‌నితో సామ‌ర‌స్యంగా విడిపోయారు. ప్రస్తుతం జెరూస‌లేంకు చెందిన పియానిస్ట్ గ‌య్ హ‌ర్ష్‌బ‌ర్గ్‌తో స‌హ‌జీవ‌నం చేస్తున్నారు. కల్కి తల్లి కాబోతోందన్న వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇక కల్కి బాలీవుడ్ లో ప్రముఖ హీరోహీరోయిన్లతో హిట్ సినిమాల్లో నటించి మంచి పేరు సంపాదించుకున్నారు.

Related posts