ఆంధ్ర వ్యాపారులపై తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రిషి నీట్, మెడికల్ అకాడమీకి చెందిన విద్యార్థులు మెడిసిన్ లో 30 సీట్లు సాధించిన సందర్భంగా మహబూబ్ నగర్ లో అభినందన సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆంధ్రకు చెందిన కొందరు వ్యాపారస్థులు విద్యను వ్యాపారం చేశారని దుయ్యబట్టారు.
నాణ్యమైన విద్య పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులను దోచుకుంటున్నారని విమర్శించారు. విద్యార్థులకు మంచి చదువు నేర్పిస్తామని చెప్పి, ఆంధ్ర వ్యాపారులు మనల్ని మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఆంధ్ర వ్యాపారుల ఊబిలో ఎవరూ పడొద్దని సూచించారు. తెలంగాణ ప్రజలు విశ్వాసం కలిగి ఉంటారని, మోసం చేయడం వారికి తెలియదని చెప్పారు. నమ్మితే తెలంగాణ వాళ్ళు ప్రాణాలు కూడా ఇస్తారని మంత్రి పేర్కొన్నారు.
కల్వకుంట్ల జగన్ మోదీ రెడ్డి: లోకేష్