telugu navyamedia
క్రీడలు వార్తలు

చిరాకుతో చెప్పిన సమాధానం అది.. ఆధారాలు లేవు : బెన్‌క్రాఫ్ట్

న్యూల్యాండ్స్ వేదికగా 2018లో సౌతాఫ్రికాతో జరిగిన టెస్ట్‌లో బాల్ ట్యాంపరింగ్ పాల్పడి బెన్‌క్రాఫ్ట్ టీవీ కెమెరాలకు అడ్డంగా దొరికిపోయాడు. దీంతో బెన్‌క్రాఫ్ట్‌తో పాటు అప్పటి కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌ను సీఏ జట్టు నుంచి తప్పించింది. బెన్‌క్రాఫ్ట్‌పై 9 నెలలు, స్మిత్, వార్నర్‌లపై ఏడాది పాటు నిషేధం విధించింది. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో న్యూల్యాండ్స్ ఘటన గురించి మాట్లాడిన బెన్‌క్రాఫ్ట్.. అప్పుడు టీమ్‌లో ఉన్న బౌలర్లకు ట్యాంపరింగ్ గురించి తెలుసని సంచలన వ్యాఖ్యలు చేశాడు. అతని కామెంట్స్ ఆస్ట్రేలియా క్రికెట్‌లో కలకలం రేపాయి. దాంతో ఈ ఉదంతంపై పై సమగ్ర విచారణ జరిపించడంలో క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) విఫలమైందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

దాంతో ఈ ఘటనపై రీఇన్వెస్టిగేషన్‌కు తాము సిద్దమంటూ క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. కానీ, ఆసీస్ మీడియా కథనాల ప్రకారం బెన్‌క్రాఫ్ట్ ఈ విషయంలో చెతులెత్తేశాడని తెలుస్తోంది. తన కామెంట్స్‌తో చిక్కుల్లో పడిన తమ టీమ్ బౌలర్లు కమిన్స్, హాజిల్ వుడ్, నాథన్ లయన్, స్టార్క్‌కు కూడా బెన్‌క్రాఫ్ట్ వివరణ ఇచ్చుకున్నాడు. దీనిపై బౌలర్లంతా ఉమ్మడిగా ఓ ప్రకటన విడుదల చేశారు. సాండ్ పేపర్ గేట్ గురించి ఇంటర్వ్యూలో ఊహించని ప్రశ్నలు ఎదురవ్వడంతో చిరాకుతో ఏదో సమాధానం చెప్పానని బెన్‌క్రాఫ్ట్ మాకు చెప్పాడని, కావాలని ఆ కామెంట్స్ చెయ్యలేదన్నాడు. న్యూలాండ్స్ టెస్ట్‌లో జరిగిన బాల్ ట్యాంపరింగ్ గురించి మాకు ముందుగా ఏమీ తెలియదనే విషయాన్ని మరోసారి స్పష్టం చేస్తున్నామని బౌలర్లు ఆ ప్రకటనలో స్పష్టం చేశారు.

Related posts