telugu navyamedia
రాజకీయ వార్తలు

ఇమ్రాన్‌ ఫేక్ వీడియో.. అసదుద్దీన్ ఒవైసీ ఫైర్

asaduddin owisi

యూపీలో ముస్లింలపై పోలీసులు దౌర్జన్యానికి పాల్పడుతున్నారని పాక్ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ఓ ఫేక్ వీడియోను ట్వీట్‌ చేసిన అభాసుపాలైన విషయం తెలిసిందే. ఈ వీడియో పై ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ఇమ్రాప్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో జరిగిన ఓ ఘటనకు సంబంధించిన వీడియోను భారత్‌లో జరిగినట్టుగా ఇమ్రాన్ తప్పుడు పోస్ట్‌ చేశారని ఆయన అన్నారు. ఆయన మొదట తన దేశం గురించి ఆలోచించాలని ఒవైసీ హితవు పలికారు.

పాక్‌లోని గురుద్వారాపై జరిగిన రాళ్ల దాడిపై సిక్కులకు రక్షణ కల్పించాలని కోరారు. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకే ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌, సీఏఏలను తీసుకొస్తోందని అన్నారు. ఎన్‌ఆర్‌సీ చట్టానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న తనను చంపేందుకు కేంద్రం, ఆర్‌ఎస్‌ఎస్‌ కుట్రలు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు.

Related posts