telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

తెలంగాణ భారీగా కరోనా కేసులు…

తెలంగాణలో కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో కరోనా కేసులు 3 లక్షలకు చేరువలో ఉన్నాయి. అయితే… ఇవాళ రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరిగింది. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 163 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అలాగే 24 గంటల్లో ఒకరు మృతి చెందారు. దీంతో.. పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,98,086 కి చేరుకుంది. ఇక ఇప్పటి వరకు కరోనా బారినపడి 2,95, 544 మంది కోలుకున్నారు. తాజా మరణాలతో రాష్ట్రంలో మొత్తం 1,635 మంది మృతి చెందారు. దేశవ్యాప్తంగా కరోనా మరణాల రేటు 1.4 శాతంగా ఉంటే.. రాష్ట్రంలో 0.57 శాతానికి పడిపోయిందని.. రికవరీ రేటు దేశంలో 97.1 శాతంగా ఉంటే.. స్టేట్‌లో 98.81 శాతానికి పెరిగిందని బులెటిన్‌లో పేర్కొంది సర్కార్. ఇక, ప్రస్తుతం 1,907 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Related posts