*మహారాష్ర్ట రాజకీయాల్లో అదిరిపోయిన ట్విస్ట్
*సీఎంగా ఏక్‌నాథ్ షిండే.. కాసేపట్లో ప్రమాణ స్వీకారం
*ఉద్ధవ్ థాక్రే మాకు అపాయింట్‌మెంట్ ఇవ్వనేదు
*సీఎం పదవిని వదులుకున్న ఫడ్నవీస్
*నేను ప్రభుత్వం నుంచి దూరంగా ఉంటాను..
మహారాష్ట్ర రాజకీయంలో అదిరిపోయిన ట్విస్ట్ చోటుచేసుకుంది. శివసేన రెబల్ ఎమ్మెల్యేలకు నాయకత్వం వహిస్తున్న ఏక్‌నాథ్ షిండే.. మహారాష్ట్ర తదుపరి సీఎంగా బాధ్యతలు తీసుకోనున్నారు.
ఈ రోజు రాత్రి 07.30 గంటలకు రాజ్‌భవన్‌లో ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారు.ఈ మేరకు మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ మీడియా సమావేశంలో ప్రకటన చేశారు.
ఉద్ధవ్ ఠాక్రే రాజీనామాతో రాష్ట్రంలో సర్కారు కుప్పకూలగా.. అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా ఉన్న బీజేపీకు ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం లభించింది.
ఈ నేపథ్యంలోనే శివసేన రెబల్ నేత ఏక్‌నాథ్ శిందేతో కలిసి గవర్నర్‌ను కలిశారు. మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని అంతా భావించారు. శిందేకు ఉప ముఖ్యమంత్రి పదవి లభిస్తుందని అంచనా వేశారు.
అయితే, శిందేకు ఏకంగా సీఎం పదవిని అప్పగిస్తూ సంచలన ప్రకటన చేశారు ఫడ్నవీస్. షిండేకు బీజేపీ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఫడ్నవీస్ స్పష్టం చేశారు. అయితే.. తాను ప్రభుత్వానికి దూరంగా ఉండనున్నట్లు వెల్లడించారు.
ఏక్‌నాథ్ షిండే సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత.. మంత్రివర్గ విస్తరణ ఉంటుందని దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. శివసేనతో పాటు బీజేపీ నేతలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారని వెల్లడించారు.
గత ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా నిలిచిందని గుర్తుచేశారు. బీజేపీ, శివసేన కలిసి ఎన్నికల్లో పోటీ చేశాయని, బీజేపీ-శివసేన కూటమికే ప్రజలు పట్టం కట్టారని ఫడ్నవీస్ చెప్పారు. ఎన్నికల తర్వాత ఉద్ధవ్ ఠాక్రే యూటర్న్ తీసుకున్నారని, మరాఠీల తీర్పును ఉద్ధవ్ ఠాక్రే పక్కన పెట్టారని ఫడ్నవీస్ ఆరోపించారు
మహా వికాస్ అఘాడి ప్రభుత్వం వల్ల పలు అభివృద్ధి పనులు ఆలస్యమయ్యాయని, వాటిని శివసేన-బీజేపీ ప్రభుత్వం పూర్తి చేస్తుందని చెప్పారు. వారి హయంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు.
ఇద్దరు మంత్రులు మనీలాండరింగ్ కేసులో ఉన్నారని.. అవీనితి ఎక్కువగా జరిగిందని మండిపడ్డారు దేవేంద్ర ఫడ్నవీస్. ప్రజాతీర్పును అవమానిస్తూ.. కాంగ్రెస్, ఎన్సీపీతో ఉద్ధవ్ థాక్రే చేతులు కలిపారని దుయ్యబట్టారు. అధికారం కోసం హిందూత్వ సిద్ధాంతాన్ని కూడా పక్కనబెట్టారని విరుచుకుపడ్డారు. బాల్‌ఠాక్రే ఆశయాలకు ఉద్ధవ్ తూట్లు పొడిచారని దుయ్యబట్టారు. శివసేన, బీజేపీ కలిసి.. మహారాష్ట్రను మరింత ముందుకు తీసుకెళ్తామని చెప్పారు.
హిందుత్వ అజెండా కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని షిండే తెలిపారు. బాల్ థాక్రే ఆశయాలను తాను కొనసాగిస్తానని షిండే చెప్పారు. సిద్ధాంతపరంగా బీజేపీ తాము ఒక్కటేనని షిండే తెలిపారు.
అమిత్ షా టీడీపీకి తలుపులు మూసేశారు: కన్నా