telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

ఇకపై ఆ వీడియోలు చూడాలంటే ముఖం చూపించక తప్పదు…!

Scan

ఆస్ట్రేలియా ప్రభుత్వం నీలిచిత్రాల వీక్షకుల విషయంలో సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. అలాంటి వీడియోలను చూసేవారి విషయంలో ‘ఫేస్ వెరిఫికేషన్ సర్వీస్’ను అమలు చేయాలని అక్కడి ప్రభుత్వం భావిస్తోంది. ఆ వెబ్‌సైట్స్ ఓపెన్ చేసిన వెంటనే వారి వయసు ధృవీకరించడానికి ముఖం ఫోన్ కెమెరా ఎదురుగా పెట్టాల్సి ఉంటుంది. అనంతరం.. స్కాన్ చేశాక వీడియోలు చూసేందుకు తగిన వయసు ఉంటేనే వీడియోలు ఓపెన్ అవుతాయి. లేని పక్షంలో ఓపెన్ కావు. ఆస్ట్రేలియాలో నీలి చిత్రాలు చూసే వారిలో 44 శాతం మంది 9 నుంచి 16 సంవత్సరాల లోపు వారే ఉన్నారని ప్రభుత్వం గుర్తించింది. దీంతో.. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని అమలు చేయాలని భావిస్తోంది.

Related posts