telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

పౌరసత్వ బిల్లు 2019కి .. రాష్ట్రపతి ఆమోదముద్ర…

Ram Nath Kovind

రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పౌరసత్వ బిల్లు 2019ను ఆమోదించారు. ఫలితంగా అది పౌరసత్వ (సవరణ) చట్టంగా మారింది. అధికారిక గెజిట్ విడుదల చేయడంతో ఇది చట్టంగా అమల్లోకి వచ్చింది. ఈ చట్టం ప్రకారం… 2014 డిసెంబర్ 31కి ముందు… పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్థాన్ నుంచీ భారత్‌లోకి వచ్చి నివసిస్తున్న హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్శీలు, క్రైస్తవులు… భారత దేశ పౌరసత్వం పొందేందుకు అవకాశం లభించంది. ఐతే… ఆ వచ్చిన వారిలో… ఆయా దేశాల్లో మతపరమైన వేధింపుల్ని తట్టుకోలేక వచ్చిన వారికి మాత్రమే పౌరసత్వం లభించనుంది.

పౌరసత్వ (సవరణ) బిల్లును సోమవారం లోక్‌సభ ఆమోదించగా… బుధవారం రాజ్యసభ ఆమోదించింది. దీనితో రాష్ట్రపతి ఆమోదానికి పంపారు. రాష్ట్రపతి కూడా ఆమోదించడంతో… చట్టంగా మారింది. ఐతే… ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ… అసోంలో అల్లర్లు కొనసాగుతున్నాయి. అసోం ప్రజల హక్కులకు ఎలాంటి భంగమూ కలగనివ్వబోమని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు.

Related posts