telugu navyamedia
ఆంధ్ర వార్తలు

వారసత్వమంటే తాత, తండ్రి, కొడుకు అని.. మామ, అల్లుడు కాదు ..

వైసీపీ మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని మచిలీపట్నంలో బుధవారం నిర్వహించిన వైఎస్సార్‌సీపీ ప్లీనరీ సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వారసత్వమంటే తాత, తండ్రి, కొడుకు అని.. మామ, అల్లుడు కాద‌ని అన్నారు.

మచిలీపట్నంలో వారసుడినే గెలిపించాలని ఇల్లరికం వచ్చిన కొల్లు రవీంద్ర (టీడీపీ)ని కాదని చెప్పారు. వైసీపీ తరపున మాజీ మంత్రి పేర్ని నాని నిలబడినా, ఆయన కుమారుడు పేర్ని కృష్ణమూర్తి నిలబడిగా నిలబడినా అండగా నిలబడాలని కోరారు

వారసత్వం అంటే దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్ అని… సీనియర్ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్అ ని చెప్పారు. అన్నగారి వారసుడు జూనియర్ ఎన్టీఆరే అని ఈ సందర్భంగా నందమూరి కుటుంబంపై ఆయన వ్యాఖ్యలు చేశారు. మామ పేరు చెప్పుకునే ఇల్లరికం అల్లుళ్లు మనకెందుకంటూ పరోక్షంగా చంద్రబాబు నాయుడిపై కొడాలి విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో చంద్రబాబు, బందరులో కొల్లు రవీంద్ర వంటి ఇల్లరికం అల్లుళ్లను ఇంటికి పంపించాలని ప్రజలను కోరారు.

కాగా గుడివాడలో నిన్న‌ జరిగిన వైసీపీ ప్లీనరీలోనూ కొడాలి నాని.. ఎన్టీఆర్ విగ్రహాన్ని ఎవరైనా ఎక్కడైనా పెట్టుకోవచ్చంటూ చెప్పుకొచ్చారు. ఏ రంగు అయినా వేసుకోవచ్చని చెప్పారు.

టీడీపీ ఎన్టీఆర్‌కు సంబంధం లేదని కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొచ్చారన్నారు కొడాలి నాని. ఎన్టీఆర్ ఏ పార్టీకి చెందిన వారు కాదని పేర్కొన్నారు. టీడీపీకి, ఎన్టీఆర్ కు సంబంధం లేదని ఎన్నికల సంఘానికి లేఖ ఇచ్చిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఎన్టీఆర్ నుంచి పార్టీని లాక్కొని వెన్నుపోటి పొడిచిన వ్యక్తి చంద్రబాబు కాదా అంటూ కొడాలి నాని ప్రశ్నించారు.

తనను ఓడించినా..గెలిపించినా అది గుడివాడ ప్రజల చేతిలోనే ఉందన్నారు. ‘నాది గుడివాడ.. నేను 2004లో గెలిచా.. 2009లో గెలిచా.. 2019లో గెలిచా.. 2024లో గెలుస్తా.. 2029లో గెలుస్తా.. ఇక్కడే పుట్టా.. ఇక్కడే చనిపోతా.. ఇక్కడే మట్టిలో కలిసిపోతా’ అని కొడాలి నాని అన్నారు.

చంద్రబాబుకు దమ్ముంటే గుడివాడలో తనపై పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. తనను ఓడించడం కాదని.. ముందు 2024లో కుప్పంలో గెలవాలంటూ నాని చురకలు వేశారు.వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ చంద్రబాబును ఆయన దత్తపుత్రుడిని ఓడిస్తామని కొడాలి నాని అన్నారు.ఎన్టీఆర్‌ మరణానికి కారణమైన చంద్రబాబు నిమ్మకూరులో బసచేస్తే ఆయన ఆత్మ క్షోభిస్తుందని కొడాలి నాని అన్నారు.

Related posts