telugu navyamedia
సినిమా వార్తలు

ప్ర‌పంచ కుబేరుడిని క‌లిసిన మ‌హేష్ బాబు దంప‌తులు ..

*ప్ర‌పంచ కుబేరుడిని క‌లిసిన మ‌హేష్ బాబు..
*బిల్ గేట్స్ ని క‌ల‌వ‌డం హ్యాపీగా ఉంది..

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవలే సర్కారు వారి పాట సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ సొంత చేసుకున్నాడు .ఈ క్రమంలో సర్కారు వారి పాట విజయోత్సాహంతో భార్య నమ్రత, పిల్లలు గౌతమ్, సితారలతో యూరప్ టూర్ వెళ్ళిపోయాడు. అక్కడ రోజూ ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్ కి అప్ డేట్ ఇస్తున్నాడు.

దాదాపు ఆయన ట్రిప్ పూర్తి కావోస్తోంది. మరో రెండు, మూడు రోజుల్లో ఇండియాకు కూడా తిరిగి రానున్నట్టు తెలుస్తోంది. ఈ వియాహార యాత్రలో భాగంగా మహేష్ తన ఫ్యామిలీతో న్యూయార్క్ లోని బిగ్ యాపిల్‌ కు చేరుకున్నట్లు తెలుస్తుంది. అంతేగాక తన సతీమణి నమ్రతతో కలిసి ప్రపంచ కుబేరుడు, మైక్రోసాఫ్ట్ అధినేత అయినటువంటి బిల్ గేట్స్ ని కలిశాడు.

ఈ సందర్భంగా బిల్ గేల్స్ తో కలిసిన ఓ ఫొటోను తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు మిస్ట‌ర్‌“బిల్‌గేట్స్ ని కలవడం చాలా ఆనందంగా ఉంది. ప్రపంచంలోని అత్యుత్తమ వ్యక్తుల్లో ఒకరు .ఆయ‌న నిజ‌మైన‌ ఇన్స్పిరేషన్. .ఎంతో వినయం కలిగిన వ్యక్తి” అంటూ క్యాప్షన్ జోడించడం విశేషం.

ప్ర‌స్తుతం బిల్ గేట్స్ తో మహేష్ కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయగా.. ఇప్పుడు ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోపై రియల్ శ్రీమంతుడితో రీల్ శ్రీమంతుడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

సినిమాలు విష‌యానికొస్తే ..ఇండియాకి వచ్చాక మహేష్ , త్రివిక్రమ్ తో తన 28వ సినిమా చేయనున్నాడు. అనంతరం SS రాజమౌళితో పాన్ ఇండియా మూవీకి రెడీ కాబోతున్నాడు.

Related posts