telugu navyamedia
ఆంధ్ర వార్తలు

శ్రీశైలంలో ప్రారంభమైన శివ‌రాత్రి ఉత్స‌వాలు..

*శ్రీశైలంలో ఘనంగా మ‌ల్ల‌న్న‌ శివరాత్రి ఉత్సవాలు ప్రారంభం..
* నేడు శ్రీకాళహస్తి దేవస్థానం తరపున పట్టువస్త్రాలు

ప్రముఖ పుణ్యక్షేత్రం,  శ్రీశైలంలో నేటి నుంచి మల్లికార్జున స్వామి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ రోజు ఉదయం ఉదయం 8 గంటలకు స్వామివారి యాగశాల ప్రవేశంతో ఉత్సవాలు మొదలయ్యాయి..

ఇవాల్టి నుంచి మార్చి నాలుగో తేదీ వరకూ 11 రోజుల పాటు మల్లన్న బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.

బ్రహ్మదేవుడి క్షేత్రపాలకుడైన వీరభద్రస్వామి పర్యవే క్షణలో, శివపరివార దేవతలలో ఒకరైన చండీశ్వరుని నాయకత్వంలో ఈ ఉత్సవాలు జరుగుతాయని ప్రతీతి. .

బ్రహ్మోత్సవాల సందర్భంగా మొదటిసారి స్వామి, అమ్మవార్లకు దేవస్థానం పట్టువస్త్రాలను శ్రీకాళహస్తి దేవస్థానం సమర్పించనుంది.

సాయంత్రం బ్రహ్మోత్సవాలకు సకల దేవతలకు ఆహ్వానం పలుకుతూ ధ్వజారోహణ, ధ్వజపటం ఆవిష్కరణ ఉంటుందని అధికారులు తెలిపారు.

నేటి నుంచి భక్తులందరికి స్వామివారి అలంకార దర్శనం ఉంటుందని.. మార్చి 5వ తేదీ నుండి స్పర్శ దర్శనాలు పునఃప్రారంభం అవుతాయని ప్రకటించారు.

అలాగే బ్రహ్మోత్సవాలలో భాగంగా భ‌క్తుల‌కు ఎలాంటి అసౌక‌ర్యాలు క‌ల‌గ‌కుండా కరోనా నిబంధనలను పాటించేలా.. అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

భక్తులంతా కరోనా నిబంధనలు పాటించాలని సూచించారు. మరో వైపు మాస్కులు లేకుండా భక్తులు ఆలయంలోకి అనుమతించడం లేదు.

Related posts