telugu navyamedia
తెలంగాణ వార్తలు

మోడీ రాక్షస పాలన అంతానికి.. కేసీఆర్ జాతీయ పార్టీని ఏర్పాటు చేయాల్సిందే..

దేశంలో బీజేపీ రాక్షస పాలన కొనసాగిస్తోందని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. తెలంగాణ భవన్ లో నిర్వహించిన టీఆర్ఎస్ పార్టీ జిల్లాల అధ్యక్షుల మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధాని మోదీ పాలనలో ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

దేశ ప్రజలంతా నాయకుని కోసం ఎదురు చూస్తున్నారని, కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టాల్సిందేనన్నారు. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేందుకు గాను జాతీయ పార్టీని ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.

గడిచిన 8 ఏండ్లలో కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో దుర్మార్గమైన పాలన కొనసాగుతుందని ఆయ‌న‌ విమర్శించారు. మోడీ కాలంలో ఏ ఒక్క వర్గానికి న్యాయం జరగలేదు. అన్ని వర్గాలను మోడీ నట్టేట ముంచాడు.

రైతులు, దళితులు, గిరిజనులు, మైనార్టీలు, బహుజనులు, బలహీన వర్గాలు, యువత, మహిళలు ఇలా ఏ ఒక్క వర్గానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం న్యాయం చేయలేదు.

దేశంలోని పటిష్ఠ ప్రజాస్వామిక పునాదులను, ప్రజాస్వామ్య బద్ధంగా నడవాల్సిన వ్యవస్థలను ధ్వంసం చేస్తూ.. దేశాన్ని 100 సంవత్సాల వెనకకు తీసుకుపోతున్న ఒక అసమర్థ, చేతకాని దద్దమ్మ ప్రధాని నరేంద్ర మోడీ అని బాల్క సుమన్ విరుచుకుపడ్డారు.

Related posts