telugu navyamedia
తెలంగాణ వార్తలు

నేడు హైదరాబాద్ కు ప్రధాని మోదీ : హై సెక్యూరిటీ ..

*నేడు, రేపు, బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు..
*పాల్గొన‌నున్న మోదీ స‌హా కేంద్ర జాతీయ మంత్రులు తో పాటు

*మోదీ రెండు రోజులు ప‌ర్య‌ట‌న కట్టుదిట్టమైన భద్రత..

కమలం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జాతీయ కార్యవర్గ సమావేశాలకు హైద‌రాబాద్ న‌గ‌రం అందంగా ముస్తాబైంది. నేడు ప్రధాని నరేంద్ర మోదీ, సహా పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీపాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, జాతీయ కార్యవర్గ సభ్యులు ఇతర దిగ్గజ నేతలు హాజరవుతున్నారు.

ప్ర‌ధాని మోదీ షెడ్యూల్‌

ఈ రోజు మధ్యాహ్నం 12.45 నిమిషాలకు ఢిల్లీ విమానాశ్రయం నుంచి ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ నగరానికి బయలుదేరుతారు. 2.55 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో మాదాపూర్ హెచ్ఐసీసీకి వెళతారు. 3.20 గంటలకు నోవాటెల్ కు చేరుకుంటారు. కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత సాయంత్రం జాతీయ కార్యవర్గ సమావేశాలకు మోదీ హాజరు కానున్నారు . రాత్రి 9 గంటల వరకు సమావేశంలోనే ఉండనున్నారు . ఇక జూలై 3 ఉదయం 10 గంటలకు పార్టీ సమావేశాలకు హాజరవుతారు. సాయంత్రం 4.30 వరకు సమావేశాల్లోనే ఉంటారు. పలు అంశాలపై కార్యవర్గ సభ్యులకు మోదీ దిశానిర్దేశం చేయనున్నారు. ఆ తర్వాత హోటల్ కు వెళతారు. అనంతరం పరేడ్ గ్రౌండ్ లో జరగనున్న విజయ సంకల్ప సభలో పాల్గొనేందుకు సాయంత్రం 5:55 గంటలకు హెచ్ఐసీసీ నుంచి బయలుదేరుతారు. 6.30 పరేడ్ గ్రౌండ్స్ సభకు మోదీ చేరుకుంటారు. 6.30 నుంచి 7.30 వరకు సభలో ఉంటారు. అక్కడ ప్రజలు, కార్యకర్తలనుద్దేశించి ప్రధాని ప్రసంగించనున్నారు.

ఇక జులై 4న ఉదయం 9.20 గంటలకు బేగంపేట్ విమానాశ్రయం చేరుకుని అక్కడి నుంచి బయలుదేరి ఆంధ్రప్రదేశ్ లోని భీమవరం చేరుకుంటారు. అక్కడ అల్లూరి శతజయంతి ఉత్సవాల్లో పాల్గొంటారు. అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించి, అనంతరం జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు.

4 అంచల భద్రత :-

ప్ర‌ధాని ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా 4 అంచల భద్రతతో పాటు వీఐపీ సెక్యూరిటీ, అప్పర్, లోయర్, మిడిల్ ఇలా ప్రధాని మోదీ చుట్టూ ఎస్పీజీ ఫోర్స్‌, ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్, సాయుధ బెటాలియన్ దళాలు మోహరించనున్నాయి.

అద‌నంగా వీఐపీ & వీవీఐపీ భద్రత ఏర్పాటు చేస్తున్నారు. దీనికోసం ఇప్పటికే ఎప్పీజీ రంగంలోకి దిగింది. నగరంలోని వివిధ విభాగాల పోలీసు బలగాలతో పాటు, నోవాటెల్ హోటల్ చుట్టూ ఇతర ప్రాంతాల నుండి అదనపు బలగాలు మోహరించారు. ఇప్పటికే నోవేటెల్ హోటల్ చుట్టూ నాలుగు అంచాల భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ప్రధాని మోదీ భద్రతో హైడ్ సెక్యురిటీ ( కంటికి కనిపించకుండా మెరుపు దాడి చేసే భద్రతా వలయం), పిటింగ్ (వేరీ షార్ప్ ఇంటలిజెన్స్, షార్ప్ షూటర్, ఆక్టివ్, విత్ ఆఫీసర్స్ గైడ్ లైన్స్ ), ల్వోల్టా సెక్యురిటీ ( హై రిస్క్ స్కిల్స్ సెక్యూరిటీ గార్డ్స్ ), స్నిపర్ డాగ్, బాంబ్ స్క్వాడ్ బృందాలు, ముఫ్తీ పార్టీలకు త్వరిత ప్రతిస్పందన బృందాలు ( ఎస్బీ, ఇంటలిజెన్స్, కౌంటర్ ఇంటెలిజెన్స్, ఇన్ఫర్మేషన్ బ్యూరో ) మోహరించున్నారు. ఎప్పటికప్పుడు నగరంలో భద్రతా ఏర్పాట్లను అంచనా వేస్తూనే ఉన్నాయి ఎస్పీజీ బృందాలు. ఎస్పీజీ బ్లూ బుక్ గైడ్ లైన్స్ ప్రకారం భద్రత ఏర్పాట్లు కట్టుదిట్టంగా ఉండనున్నాయి.

Related posts