telugu navyamedia
తెలంగాణ వార్తలు

పోల‌వ‌రం పూర్త‌యితే భద్రాచానికి ముప్పు..పోల‌వ‌రం ఎత్తు త‌గ్గించాల్సిందే..

*తెలుగురాష్ర్టాల మ‌ధ్య మ‌ళ్ళీ మొద‌లైన పోల‌వ‌రంపై పంచాయితీ..
*పోల‌వ‌రం పూర్త‌యితే భద్రాచానికి ముప్పు..
*పోల‌వ‌రం ఎత్తు త‌గ్గించాల్సిందే..
*పోల‌వ‌రం వ‌ల్ల భద్రాచలానికి ఎలాంటి ముప్పు ఉండ‌దు..

పోలవరం ప్రాజెక్టు ఎత్తు పెంపుపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య వార్ ముదరుతున్నట్లే కనిపిస్తుంది. ప్రాజెక్టు ఎత్తు పెంచాలని ఏపీ ప్రభుత్వం భావిస్తుంది. అయితే పోలవరం ఎత్తు తగ్గించాలని తెలంగాణ ప్ర‌భుత్వం డిమాండ్ చేస్తుంది.

పోలవరం ఎత్తును పెంచుకుంటూ పోతే తెలంగాణకు ముప్పు ఏర్పడుతుందని రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. పోలవరం ఎత్తు తగ్గించేందుకు కేంద్రం బాధ్యత తీసుకోవాలని కోరారు. 

పోలవరం నుంచి నీటి విడుదల ఆలస్యం వల్ల గోదావరి వరద ఉధృతి పెరిగిందని అన్నారు. పోలవరం ఎత్తు పెంపుతో భద్రాచలం వద్ద నిరంతరం 45 అడుగుల మేర నీటి ప్రవాహం ఉంటుందని చెప్పారు.

భద్రాచలానికి అనుకొని ఉన్న ఐదు గ్రామాలను తెలంగాణలో కలపాలని డిమాండ్ చేస్తున్నారు. ఏపీ ముంపు గ్రామాల ప్రజలు తెలంగాణ పునరావాస కేంద్రాల్లోనే ఉన్నారని వారు చెబుతున్నారు. 

కాగా.. భద్రాచలం వరద నుంచి శాశ్వత పరిష్కారానికి వెయ్యి కోట్ల రూపాయలను సీఎం కేసీఆర్ ప్రకటించారన్నారు. పోలవరం వల్ల గోదావరి ప్రవాహం స్లోగ వెళ్తోందన్నారు.పోలవరం ఎత్తు తగ్గించాలని గతంలో ఏపీని కోరామని చెప్పారు.  సీఎం రోడ్డు మార్గాన వచ్చి వరద బాధితులను కలిసి ధైర్యం చెప్పారన్నారు.

వరద బాధితులను ముంపు ప్రాంతాల నుంచి తరలించి శాశ్వత గృహాలు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలను కొనసాగిస్తున్నామని మంత్రి అజయ్ చెప్పారు

Related posts