telugu navyamedia
ఆంధ్ర వార్తలు

లక్ష్మీపార్వతికి సుప్రీం షాక్ : చంద్రబాబు ఆస్తులపై వేసిన‌ పిటిషన్ ను కొట్టివేత‌

*చంద్రబాబు ఆస్తులపై లక్ష్మీపార్వతి

దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేసిన సుప్రీంకోర్టు

*చంద్రబాబు ఆస్తులపై విచారణ కోరడానికి మీరెవరు

వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతికి సుప్రీంకోర్టులో షాక్ త‌గిలింది.టీడీపీ అధినేత చంద్రబాబు ఆస్తులపై విచారణ జ‌ర‌పాల‌ని కోరుతూ.. లక్ష్మీపార్వతి దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.

చంద్రబాబు ఆస్తులపై విచారణ కోరడానికి మీరెవరు మీరెవరని లక్ష్మీపార్వతికి సుప్రీంకోర్టు ప్రశ్నించింది. హైకోర్టు అన్ని విధాలా ఆలోచించాకే ఆ పిటిషన్ కొట్టివేసిందని సుప్రీంకోర్టు తెలిపింది. అంతేకాకుండా ఎవరి ఆస్తులు.. ఇంకొకరికి ఎందుకు తెలియాలని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. లక్ష్మీ పార్వతి లేవనెత్తిన అంశంలో విలువ లేదని పిటిషన్ ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది.

గత నెలలో అమిత్ షా – ఎన్టీఆర్ భేటీ అయిన తర్వాత లక్ష్మీ పార్వతి కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలో ఆగస్టు 24న ఆమె మీడియాతో మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని ఆకాంక్షించారు. తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ స్వాధీనం చేసుకోవాలంటూ లక్ష్మీ పార్వతి సూచించారు. అదే తన కోరిక అని పేర్కొన్నారు. 

ఇదిలా ఉండగా, గతనెల ఆత్మహత్య చేసుకుని చనిపోయిన ఎన్టీఆర్ చిన్న కూతురు ఉమామహేశ్వరి తను చనిపోయే ముందు లేఖ రాసిందని లక్ష్మీ పార్వతి తెలిపారు.  ఆ ప్రదేశానికి చంద్రబాబు నాయుడు వెళ్లాక ఆ లేఖ మాయమైందని ఆమె ఆరోపించారు.

చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ కుటుంబానికి శనిలాంటి వాడని ఆమె వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ కుమార్తె ఉమా మహేశ్వరి మృతి మిస్టరీగా మారిందన్నారు.

 

Related posts