హైదరాబాద్ నగరంలో ప్రబలుతున్న జ్వరాలపై పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జ్వరాల నియంత్రణకు ప్రజల సహకారం అవసరమన్నారు. హైదరాబాద్ లో జ్వరాలు తగ్గుముఖం పట్టాయన్నారు. అధికారులు, ప్రజలు ఏయే నెలలో ఏం చేయాలనే దానిపై క్యాలెండర్ ను రూపొందిస్తామని మంత్రి కేటీఆర్ వివరించారు. సీజనల్ వ్యాధులను నిరోధించేందుకు ప్రత్యేక క్యాలెండర్ ను రూపొందించనున్నట్లు చెప్పారు.
జ్వరాలన్నీ డెంగీ జ్వరాలు కాదన్నారు. నీరు నిల్వ ఉండే డ్రమ్ములు, ఏసీలు, కూలర్లను శుభ్రం చేయాలని ప్రజలకు సూచనలు చేశారు.మూసీ పరివాహక ప్రాంతాల్లోనే డెంగీ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. అలాంటి ప్రాంతాల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తామని కేటీఆర్ వెల్లడించారు. దీనికోసం ప్రైవేట్ ఆస్పత్రులు వైద్యుల సేవలను వినియోగించుకుంటామని కేటీఆర్ చెప్పారు. జ్వరాలపై కాలేజీలు, స్కూళ్లలో అవగాహన కల్పిస్తామన్నారు.
చంద్రబాబు, జగన్ దొందూ దొందే: సీపీఐ నారాయణ