telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలంగాణ బీజేపీ ఎంపీ హౌస్‌ అరెస్ట్‌!

soyam bapu rao

తెలంగాణలో బీజేపీ, టీఆర్‌ఎస్‌ పార్టీలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్న నేపథ్యంలో ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయంబాపూరావు అరెస్ట్‌ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. సోమవారం సోయంబాపూ రావుకు ఆర్మూర్‌లో ఆదివాసీ సంఘాలు చేసే సన్మానం చేయనున్నారు. ఈసన్మానకార్యక్రమాన్నిఅడ్డు కుంటామని లంబాడా సంఘాల నుంచి బెదిరింపులు వచ్చినట్టుచెబుతున్నారు. ఈనేపధ్యంలోనే ఆయనను సన్మాన కార్యక్రమానికివెళ్లకుండా హైదరాబాద్‌లోని హఫీజ్‌పేటలోని ఆయన నివాసంలోనే పోలీసులు హౌస్‌అరెస్ట్‌చేశారు.

గత కొన్ని రోజులుగా సోయంబాపూరావు, సత్యవతి రాథోడ్‌ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఆదివాసీ సంఘాలు సోయం బాపూరావుకు ఆర్మూర్‌లో జరిగేసన్మానాన్నిఅడ్డుకుంటామని లంబాడా నేతలు హెచ్చరించారు. దీంతో సోమవారం సోయంకు జరిగే సన్మాన కార్యక్రమంలో గొడవులు జరిగే సమాచారం ఉన్ననేపథ్యంలోనే ఆయనను హౌస్‌ అరెస్ట్‌చేసినట్టు పోలీసులు తెలిపారు.

Related posts