telugu navyamedia
తెలంగాణ వార్తలు

ధాన్యం కొనుగోలుకు కేంద్రం సుముఖత..

తెలంగాణ రైతుల్ని ఇబ్బందుల్లోకి నెట్టకుండా ధాన్యం సేకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసిందని పౌరసరఫరాల మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఢిల్లీ పర్యటన విజయవంతమైందనే అభిప్రాయం వ్యక్తంచేశారు.

పార్లమెంట్ లో చెప్పిన ప్రకారం ఎంతైనా కొంటామన్నారు. లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొంటామని రాతపూర్వకంగా ఇచ్చారు.మిగతా ధాన్యం సేకరణ అంశంలో స్పష్టత ఇస్తే.. కొనుగోలు చేయాలా వద్ద అని నిర్ణయం తీసుకుంటాం.ఒకటో,రెండు రోజుల్లో చెప్తామని చెప్పారు.. ఇప్పటివరకు స్పష్టత లేదు.యాసంగిలో మేము కొనమని కేంద్రంలో ఉన్న బీజేపీ వైఖరి చెప్పారు.

వారం నుంచి ఆశపడ్డాం ఆర్డర్ వస్తుంది అని.వచ్చే యసంగిలో కొనుగోలు కేంద్రాలు ఉండవు.గౌరవ ప్రదమైన మంత్రి పీయూష్ గోయల్ అబద్ధాలు చెప్పారు.మీరు బియ్యం ఇస్తలేరు అన్నారు.. కానీ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం.తీసుకువెళ్లి బాధ్యత ఎఫ్ సిఐ ది.. వాళ్ళు తీసుకెళ్లడం లేదు.

మా రైస్ మిల్లుల్లో బియ్యం ఉన్నాయి తీసుకెళ్లాలని 7 లేఖలు రాశాము.ఏడాది క్రితమే మీ దగ్గర నిల్వ స్థలం లేదు.. సమకూర్చుకోవలని లేఖలు రాశం.

చివరి నిమిషంలో ఏదో చేసే ప్రయత్నం చేశారు.తెలంగాణలో మొత్తం ఎఫ్ సి ఐ గోడౌన్లు నిండిపోయాయి.పక్క రాష్ట్రం ఏపీలోని జగ్గయ్యపేటలో ఖాళీగా ఉంది.. అది ఇవ్వండి అని కూడా లేఖ ఇచ్చాం.. ఏమి స్పందన లేదు.సంగారెడ్డిలో కూడా బియ్యం దిగుమతి ఎక్కువ ఉంది.. పక్క రాష్ట్రం బీదర్ లో ఖాళీగా ఉన్నాయి.. ఇవ్వండి అని ఆడిగం.ఖాళీగా ఉంచుతాం కానీ మాకు ఇవ్వను అన్నట్లు వ్యవహరించారు.

తెలంగాణ రాష్ట్రం ఎంత అంట అంత బియ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది.కేంద్ర ప్రభుత్వానికి ముందు చూపు లేదు.మీరు ఇస్తలేరని మా మీద నెపం పెడుతున్నారు.తెలంగాణ కు చెందిన కిషన్ రెడ్డి, బిజెపి నాయకులు సమాధానం చెప్పాలి.

Related posts