telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

చప్పట్లు కొట్టి సంఘీభావం తెలిపిన సీఎం కేసీఆర్

Cm kcr claps

దేశంలో కరోనా మహమ్మారి ఎదుర్కోవడంలో విశేషమైన సేవలందిస్తున్నా అత్యవసర సిబ్బందికి సంఘీభావం తెలుపుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ కలిసి చప్పట్లు కొట్టారు. కరోనా ఎదుర్కోవడంలో ఎంతో కృషి చేస్తోన్న వైద్య, పారిశుద్ధ్య, మీడియా సిబ్బందిని అభినందిస్తూ తన కుటుంభసభ్యులతో కేసీఆర్ కరతాళ ధ్వనులు చేశారు.

కేసీఆర్ తోపాటు గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ చప్పట్లతో అభినందనలు తెలిపారు. మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, ఈటల రాజేందర్, ఎంపీ సంతోష్ కుమార్, పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు చప్పట్లు కొట్టి…వారందరికి సంఘీభావం ప్రకటించారు.

ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపుమేరకు దేశవ్యాప్తంగా స్పందించిన ప్రజలు తమ నివాసాల వెలుపలికి వచ్చి పోలీసులు, వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది సేవలను ప్రశంసిస్తూ ప్రజలు ఈ సాయంత్రం 5 గంటలకు చప్పట్లతో హోరెత్తించారు. జనసేనాని పవన్ కల్యాణ్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తమ తమ నివాసాల్లో గంట మోగించి సంఘీభావం ప్రకటించారు.

Related posts