telugu navyamedia
రాజకీయ వార్తలు

తన పై నిషేధం విధించడంతో ధర్నాకు దిగ్గిన దీదీ…

ప‌శ్చిమ బెంగాల్‌లో 8 విడతలో ఎన్నికలు జరుగుతుండగా అక్కడ రాజ‌కీయ పార్టీల మ‌ధ్య ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌లే కాదు… అక్కడ ఎలాగైనా దీదీ సామ్రాజ్యాన్ని పడ్డగొట్టాలని చేస్తున్న బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పుడు సీన్‌లోకి ఎన్నిక‌ల క‌మిష‌న్ దిగిపోయింది.  తృణ‌మూల్ కాంగ్రెస్ అధినేత్రి, ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీపై 24 గంట‌ల పాటు నిషేధం విధించింది.. ఈసీ నిర్ణ‌యంపై టీఎంసీ నేత‌లు, శ్రేణులు తీవ్రస్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తుండ‌గా.. ధ‌ర్నాకు దిగారు మ‌మ‌తా బెన‌ర్జీ.. ఈసీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కోల్‌కతాలోని గాంధీ విగ్రహం దగ్గర నిర‌స‌న దీక్ష చేప‌ట్టారు దీదీ.. బెంగాల్ అసెంబ్లీలో పోరులో వీల్ చైర్ నుంచే ప్ర‌చారం నిర్వ‌హిస్తున్న ఆమె.. ఇప్పుడు వీల్‌చైర్‌లో ధ‌ర్నా నిర్వ‌హిస్తున్నారు. కాగా, ఏప్రిల్ 12న రాత్రి 8 గంటల నుంచి ఏప్రిల్ 13న రాత్రి 8 గంటల వరకు అంటే 24 గంటల పాటు ప్రచారానికి దూరంగా ఉండాలంటూ తృణ‌మూల్ చీఫ్ మ‌మ‌తా బెన‌ర్జీని ఎన్నిక‌ల క‌మిష‌న్ ఆదేశించింది. అయితే దీంతో ఈ వార్త వైరల్ గా మారుతుంది. 

Related posts