telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

జ‌న్ ధ‌న్ ఖాతాదారులకు శుభవార్త.. రెండో విడ‌త‌ నగదు జమ!

Jnadhan yojana

దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో జ‌న్ ధ‌న్ ఖాతాదారులకు కేంద్రం శుభవార్త చెప్పింది. పేదల జన్‌ధన్‌ ఖాతాల్లో రెండో విడత నగదు జమ చేయనున్నట్లు వెల్లడించింది. మ‌హిళ‌ల జ‌న్ ధ‌న్ అకౌంట్ల‌లో మే నెల‌కు సంబంధించిన రూ.500 సాయాన్ని కేంద్ర ప్ర‌భుత్వం జ‌మ చేయ‌డం ప్రారంభించింది. రేపటి నుంచి డ‌బ్బుల‌ను తీసుకోవ‌చ్చ‌ని సూచించింది.

ఈ నెల 4వ తేదీ నుంచి 11 వ‌ర‌కు అకౌంట్ నెంబ‌ర్ల‌లోని చివరి సంఖ్య‌ల ఆధారంగా చెప్పిన రోజుల్లో బ్యాంకుకు వెళ్లి, లేదా ఏటీఎం, ఆన్ లైన్ లో తీసుకోవ‌చ్చు. 11వ తేదీ త‌ర్వాత జ‌న్ ధ‌న్ మ‌హిళ‌ల‌ అంద‌రి అకౌంట్ల‌లో డ‌బ్బులు జ‌మ కానున్నాయి. జ‌మ అయిన‌ డ‌బ్బులు ఎక్క‌డికి పోవ‌ని, నిధానంగా తీసుకోవాల‌ని ఆయా బ్యాంకులు సూచిస్తున్నాయి. ఆయా బ్యాంకుల వద్ద సోష‌ల్ డిస్టెన్స్ తప్ప‌కుండా పాటించాల‌ని బ్యాంక్ అధికారులు సూచిస్తున్నారు.

Related posts