హోటల్ మానేజ్మెంట్ కోర్స్ కు ప్రాధాన్యత పెరుగుతున్నందున దానికి తగ్గట్టుగానే ప్రతియేటా ఆ కోర్స్ అందించే కళాశాలలు పెరిగిపోతున్నాయి. దానితో సీట్ల సంఖ్య కూడా భారీగానే ఉంటుంది. ఈ కోర్స్ కు ఉన్న డిమాండ్ నేపథ్యంలో ఏడాదికి రూ.3,800 ఫీజుతో మూడేండ్ల హోటల్ మే నేజ్‌మెంట్ కోర్సును పూర్తిచేసుకుంటే ఈ రంగంలో మంచి ఉద్యోగాలు సాధించవచ్చని కమలానెహ్రూ పాలిటెక్నిక్ మహిళా కళాశాల ప్రిన్సిపాల్ అనిల్‌కుమార్ తెలిపారు.
30 సీట్లున్న ఈ కోర్సులో మహిళలకే అవకాశం ఉన్నదని, ఇంటర్ (అన్ని గ్రూపులు) అర్హతతో ఈ కోర్సును పూర్తిచేసిన మహిళలు ఐసెట్ రాసి ఎంబీఏ చదువుకోచ్చని అ న్నారు. స్కాలర్‌షిప్‌కు అర్హత ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు ఫీజులో రాయితీతో పాటు ఉచితంగా హాస్టల్ వసతి కూడా ఉన్నదని, దోస్త్‌లో ఆన్‌లైన్‌ద్వారా దరఖా స్తు చేసుకునేందుకు ఆదివారం చివరితేదీ అని తెలిపారు. వివరాలకు 7337097378, 9030862760, 8187010928 ఫోన్ నంబర్లలో సంప్రదించాలన్నారు.
సౌత్‌లో హీరోలను చూడటానికే థియేటర్స్‌కు వస్తారు : రకుల్ ప్రీత్ సింగ్