ఇండోర్ లో జరిమానాలపై నిరసనగా బైక్ ను తగలబెట్టేశారు. పోలీసులు జరిమానాల పేరుతో వేధిస్తున్నారని ఒక యువకుడు తన ద్విచక్రవాహనాన్ని దగ్దం చేసిన ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగింది. నిబంధనలను ఉల్లంఘించారంటూ మాల్వా మిల్ పాయింట్ దగ్గర్లో ట్రాఫిక్ పోలీసులు రూ.500 జరిమానా విధించారు.
తన వద్ద డబ్బులేదని, తాను అనారో గ్యంతో బాధపడుతున్నానని ఆ యువకుడు పోలీసులను దాదాపు గంటసేపు వేడు కున్నాడు. అయినా ఎంతసేపటికీ పోలీసులు ఆయన గోడును పట్టించుకోక పోవడంతో తన బైక్‌కు నిప్పుపెట్టి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.